ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు ఉపయోగించుకొని ఏపీ ప్రజలకు మేలుచేసే విధంగా చర్చలు జరగాలని కోరారు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా సమస్యలపై అసెంబ్లీలోఅర్థవంతమైన చర్చలు చేపట్టాలని సభ్యులకు ఆయన సూచించారు. సమస్యలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయాలని, ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని సభ్యులకు ఆయన విజ్ఙప్తి చేశారు.
ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మీడియా ప్రతినిధులు చర్చకు తీసుకువచ్చారు. దీనిపై కోడెల స్పందిస్తూ...ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ మేరకు గతంలో హామీ కూడా ఇచ్చారని తెలిపారు. దీంతో ఏపీ స్పెషల్ స్టేటస్ కేంద్రం ఖాతాలోనిదని సభ అధ్యక్షుడు చెప్పినట్లయింది. మరోవైపు అసెంబ్లీలో చర్చనీయాంశం అయిన దివంగత సీఎం రాజశేఖర రెడ్డి ఫొటో తొలగింపుపై కోడెల స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ నిబంధనలను అనుసరించి.... మాజీ ముఖ్యమంత్రి ఫొటోను పెట్టే సాంప్రదాయం లేదని..తాను అదే ఫాలో అవుతున్నానని తెలిపారు.