"కుంగుబాటు".. ప్రేమ విఫలమైనా, కెరీర్ లో వెనుకబడినా, పరీక్షల్లో తప్పినా, స్నేహితులు ఏడిపించినా, బంధువులు వేలెత్తి చూపినా, అప్పులు తీసుకున్న వారు ఎగ్గొట్టినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బాధపడుతున్న మానసిక సమస్య. ఇది ఎంత పెద్ద వారైనా.. చిన్నవారైనా అందరికీ సాధారణమైపోయింది. అన్ని విధాలా అవగాహన ఉన్నవారు పైకి చెప్పుకొంటారు. పెద్దగా చదువుకోని, అసలు కుంగుబాటు లక్షణాలు ఎలా ఉంటాయో తెలియని వారు చెప్పుకోలేక లోలోన మదనపడుతుంటారు. వారు వీరని కాకుండా ఈ రెండు కేటగిరీల వారూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కొందరు తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటారు. కాగా, కుంగుబాటుకు గురైనవారిలో ఇప్పటివరకు దీపికా పడుకొనే సహా సినీ ప్రముఖుల పేర్లే వినిపించాయి. క్రీడాకారులు.. అందులోనూ అత్యంత ప్రముఖ క్రీడాకారులెవరూ కుంగుబాటుకు గురైన దాఖలాల్లేవు. అయితే, తాను కుంగుబాటుకు గురైనట్లు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు.
నెల రోజులుగా మైదానానికి దూరంగా మూడేళ్లుగా కోహ్లి ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. అతడు సెంచరీ చేసి 34 నెలలవుతోంది. ఏడాది నుంచి కనీసం అర్ధ సెంచరీలు కూడా కొట్టలేకపోతున్నాడు. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఒక టెస్టు, రెండు టీ20లు, రెండు వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లి చేసింది 76 పరుగులే. ఓవైపు రిషభ్ పంత్ వంటి కుర్రాళ్లు సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే కోహ్లి క్రీజ్ లో నిలిచేందుకే నానా కష్టాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్ లకు కోహ్లికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. టీమిండియాలో స్థానానికి పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ఓవిధంగా వేటు గానే చెప్పాలి. దీంతో నెల రోజుల నుంచి కోహ్లి మైదానానికి దూరంగానే ఉన్నాడు. ఇటీవలే తిరిగి బ్యాట్ పట్టాడు. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగే ఆసియా కప్ తొలి మ్యాచ్ కోహ్లి మైదానంలోకి దిగనున్నాడు. కెరీర్ లో అతడికిది వందో టి20.
ఇన్ని రోజుల విరామం పదేళ్లలో తొలిసారి కోహ్లి 2010 నుంచి టీమిండియా కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2012 తర్వాత అతడికి ఎదురేలేదు. వైస్ కెప్టెన్, కెప్టెన్ అయిపోయాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మాత్రం అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీ వదులుకున్నాడు. అంటే గత పదేళ్లలో అతడికిదే గడ్డు కాలం. దీంతోపాటు ఇటీవలి నెల రోజులు అతడు బ్యాటే పట్టలేదు. 2012 తర్వాత ఇలాంటి సందర్భం ఇప్పుడేనని కోహ్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు.. తన శక్తిసామర్థ్యాలను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు గా కనిపించిందని అతడు తెలిపాడు.
ఈ నేపథ్యంలోనే.. 'నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్కి తగ్గాలని.. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా కన్పించొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేదంటే పరిణామాలు హానికరంగా మారొచ్చు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
విరామ సమయంలో తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపాడు. మానసికంగా కుంగిపోయానని చెప్పుకొనేందుకు తానేమీ సిగ్గుపడనని అన్నాడు. "ఓకే.. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం అనుకునే వ్యక్తిని నేను. ఏ పనిలోనైనా పూర్తిగా వివేకం, ఆనందంతో భాగస్వామినవుతా. ఎప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడుతా. మైదానంలో ఇలా ఎలా ఉండగలుగుతారు? ఆ సామర్థ్యాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. వారికి నేను చెప్పాలనుకునేది ఒకటే.. నాకు ఆట మీదున్న ప్రేమ. ప్రతి బంతితో జట్టుకు సహకరించాల్సింది ఇంకా ఎంతో ఉందని భావిస్తా. మైదానంలోనూ నా పూర్తి శక్తిని ప్రదర్శిస్తా. ఇదేం అసాధారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా టీం గెలవాలనేదే నా లక్ష్యం" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కుంగుబాటు ఇప్పుడా..? అప్పుడా..? కోహ్లి కుంగుబాటు తాజాగా గురైనదా? గతంలోనిదా? అనేది చెప్పలేదు. విరాట్ 2010 సీజన్ సమయంలోనూ తీవ్రంగా విఫలమయ్యాడు. జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అయితే, అప్పటికి అతడు స్టార్ కాదు. కేవలం కుర్రాడు. మరుసటి రెండేళ్లలో బాగా పుంజుకుని స్టార్ అయ్యాడు. ఇప్పుడు మాత్రం కోహ్లి ప్రపంచ స్థాయి బ్యాట్స్ మన్. అతడు కనీసం 50 కొడితేనే కానీ ఎవరూ విమర్శించకుండా ఉండరు. ఈ నేపథ్యంలో ఇటీవలి వైఫల్యాలు, ఎదురుదెబ్బలను చూస్తే కోహ్లి చెప్పిన కుంగుబాటు గతంలోనిది కాదని ఇప్పటిదేనని తెలుస్తోంది. చూద్దాం.. దీనిని కోహ్లి ఎలా అధిగమించి.. మళ్లీ మునుపటి స్థాయికి వస్తాడో? రాడో?