సచిన్ టెండూల్కర్ ను అందరూ రికార్డుల రారాజు అని కీర్తిస్తారు. సచిన్ కు రికార్డులంటే మోజు అనే అభిప్రాయం కూడా జనాల్లో బలంగా ఉంది. క్రికెట్ కెరీర్లో కొనసాగినన్నాళ్లూ సాధ్యమైనన్ని ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టాలని సచిన్ ప్రయత్నించిన మాట వాస్తవం. తన రికార్డులు అలాగే పదిలంగా ఉండిపోవాలని కూడా సచిన్ కోరుకుంటాడని చాలామంది అంటుంటారు. సచిన్ రికార్డులు మరెవ్వరికీ సాధ్యం కానివని.. అతడిని మించిన మొనగాడు మరొకరు రారని అంతా అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లి వచ్చాడు. సచిన్ ను మించిన వేగంతో పరుగుల వరద పారిస్తున్నాడు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. 29 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికి సచిన్ సాధించినదానికంటే ఎక్కువే సాధించాడు కోహ్లి. ఇప్పటికే అతను వన్డేల్లో 35 సెంచరుల కొట్టేశాడు.
సచిన్ కు అత్యంత ప్రీతిపాత్రమైనది సెంచరీల రికార్డే అంటారు. వన్డేల్లో అతను 49 సెంచరీలు కొట్టగా.. టెస్టుల్లో 51 శతకాలు సాధించాడు. మొత్తంగా 100 అంతర్జాతీయ శతకాలతో చరిత్ర సృష్టించాడు. టెస్టుల సంగతేమో కానీ.. వన్డేల్లో సచిన్ శతకాల రికార్డును కోహ్లి బద్దలు కొట్టడం లాంఛనమే కావచ్చు. మరి అదే జరిగితే సచిన్ రెస్పాన్స్ ఏంటన్న ఆసక్తి జనాల్లో ఉంది. మంగళవారం సచిన్ పుట్టిన రోజు సందర్భంగా అతడిని కలిసిన విలేకరి ఒకరు... ‘విరాట్ 50 సెంచరీలు కొట్టి మీ రికార్డును తిరగరాస్తే అతడికి 50 షాంపేన్ బాటిళ్లు పంపుతారా’ అని అడిగాడు. దీనికి సచిన్ సమాధానమిస్తూ.. ‘నేను విరాట్ కు 50 షాంపేన్ బాటిళ్లు పంపను. నేనే అతడి దగ్గరికి వెళ్లి కలిసి షాంపేన్ తాగుతా’ అన్నాడు. మరి సచిన్ మనస్ఫూర్తిగానే ఈ మాట అన్నాడా.. నిజంగా కోహ్లి తన రికార్డును బద్దలు కొడితే స్పోర్టివ్ గా తీసుకోగలడా?