విరాట్ కోహ్లీ క్రికెట్ టీం ఇండియా కెప్టెన్ .. అలాగే ఆడి ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో విరాట్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డ్స ను తన పేరుపై లికించుకున్నాడు. ఇక స్పోర్ట్స్ పర్సన్ గా, అందులోనూ లీడింగ్ క్రికెటర్ గా ఉన్న కోహ్లి.. లగ్జరీ కార్లను వాడటం పెద్ద విషయం కాకపోవచ్చు. ఇప్పటికే ఇలా ఎన్నో లగ్జరీ కార్లు కోహ్లి ఖాతాలోకి వచ్చి.. పోయాయి కూడా. కాగా, అలా కోహ్లి ఖాతాలోకి వచ్చిన ఒక కారు చాలాకాలంగా పోలీస్ స్టేషన్ లోనే ఉంది. అది కోహ్లీ తోలి ఆడి కారు కావడం గమనార్హం. అయితే కోహ్లీ కారు ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఉంది అంటే ?
ఆడి ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కోహ్లికి ‘ఆడి ఆర్8 వీ10 కానుకగా వచ్చింది. దాన్ని 2016లో ఒక బ్రోకర్ ద్వారా సాగర్ థక్కర్ అనే వ్యక్తికి అమ్మేశాడు. అది కూడా తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ ఇవ్వడం కోసం సాగర్ థక్కర్.. కోహ్లి వద్ద ఆడి కారును కొనుగోలు చేశాడు. అతనికి నేర చరిత్ర ఉంది. ఒక స్కామ్‌లో భారీగా మోసం చేసి పోలీసులకు పట్టుబట్టాడు. దాదాపు రూ. 12 కోట్ల వరకూ స్కామ్ చేసి దొరికిపోయాడు. దాంతో అతన్ని అరెస్టు చేసిన ముంబై పోలీసులు, ఆడి కారును కూడా సీజ్ చేశారు.
దాంతో ఆ కారు అప్పట‍్నుంచి థానే పోలీస్ స్టేషన్ లో నే పడి ఉంది. ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ము పట్టేసి ఉన్న కారును ఆటోమొబైల్ రంగం నిపుణుడొకరు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ కోహ్లి వాడిన ‘ఆడి ఆర్8 వీ10 కారు’ పోలీస్ గ్రౌండ్ లోనే ఉంది. ఒకరు వద్ద నుంచి మరొకరి వద్దకు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ లో మగ్గుతుంది. దాదాపు ఏడాది కాలంగా కారు ఇక్కడే చూస్తున్నా. ఇప్పుడు ఆ కారు ఖరీదు ఎంత ఉంటుందో కూడా తెలీదు’ అని తెలిపాడు.