ఐపీఎల్-13 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అందరూ విఫలమై పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఎట్టకేలకు బోణీ కొట్టింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 143 పరుగులు చేయగా కేకేఆర్ లక్ష్యాన్ని 18 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శుబ్‌మన్ గిల్( 70 నాటౌట్; 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా , నితీష్ రాణా(26; 13 బంతుల్లో 6 ఫోర్లు) ధాటిగా ఆడాడు.
చివర్లో ఇయాన్ మోర్గాన్(42 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన దైన శైలిలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కోల్ కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. డక్ ఔట్ గా వెనుదిరిగాడు. హైదరాబాద్ జట్టులో యువ బ్యాట్స్ మెన్ మనీశ్ పాండే 38 బంతుల్లో 51 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేసినా అతడికి సహకారం అందించే బ్యాట్స్ మెన్ లేకపోవడంతో రైజర్స్ తక్కువ పరుగులకే పరిమితం అయ్యింది.
మ్యాచ్ లో హై లైట్స్
* 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా గిల్-ఇయాన్ మోర్గాన్ జోడి అజేయంగా 92 పరుగులు జోడించడంతో కోల్ కతా కోలుకుంది.
* హైదరాబాద్ కు కెప్టెన్ వార్నరే బలం. కొన్నేళ్లుగా ఆ జట్టు బ్యాటింగ్ లో ఎక్కువగా అతడిపై ఆధారపడుతోంది. ఈ మ్యాచ్ లో వార్నర్ 36 పరుగులే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
* కోల్ కతా బౌలర్లు అద్భుతంగా రాణించారు. రైజర్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 99 పరుగులే చేయగలిగింది.
* షారుక్ ఎన్నో ఆశలతో దినేష్ కార్తీక్ కి కెప్టెన్సీ ఇచ్చినా అతడు స్థాయికి తగ్గ విధంగా ఆడట్లేదు. మరీ ఈ మ్యాచ్ సున్నా చుట్టేశాడు.
* ఒకప్పుడు కోల్ కతా గెలుపులో సునీల్ నరైన్ ది కీలకపాత్ర. ఓపెనర్ గా వచ్చి ధనా ధన్ ఇన్నింగ్స్ తో చెలరేగేవాడు. అతడు ఈ సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఆకట్టుకోలేదు.
15 సెకన్లు ఆలస్యంగా రివ్యూ కోరిన కార్తీక్
ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన బంతికి కార్తిక్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. అయితే ఇక్కడ ఆసక్తికర సంఘటన జరిగింది. కొద్దిదూరం వెళ్లి వెనక్కి వచ్చిన కార్తీక్ గిల్ తో చర్చించి 15 సెకన్ల తరువాత ఫీల్డ్ అంపైర్ ని అప్పీల్ కోరాడు. కార్తీక్ అంత ఆలస్యంగా స్పందించి రివ్యూ కోరినా ఫీల్డ్ అంపైర్ అందుకు అంగీకరించడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీంతో అంపైర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అయితే టీవీలో రిప్లై చూసి కార్తీక్ ఔట్ అయినట్లు గానే ప్రకటించారు.