కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ కంకణం కట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తామంతా ఏకతాటి పైకి వచ్చామని దేశ ప్రజలకు చెప్పేందుకు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కోత్తలో నిర్వహించిన భారీ ర్యాలికి ప్రతిపక్షాలన్ని హజారయ్యాయి. ఈ ర్యాలీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆప్ నేత కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ వంటి సినీయర్ నాయకులు హాజారయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనీయా గాంధీ ఈ ర్యాలీలో పాల్గొనక పోయినా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులగా సినీయర్ నాయకులను పంపారు. లక్షలాది మంది హాజరైన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. దేశంలో అరాచక వాదం పెరిగిపోయిందంటూ మండిపడ్డారు.
కోల్ కోతాలో జరిగిన దీదీ ర్యాలీ సూపర్ హిట్ కావాడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండడుగులు ముందుకేసీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోను ఈ తరహా ర్యాలిని నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీని గద్దె దించేందుకు తాము క్రుషి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే అమరావతిలో భారీ ర్యాలీని నిర్వహిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆ ప్రకటన చేయాగానే పక్కనే ఉన్న బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ మైక్ తీసుకుని అమరావతిలో జరిగే ర్యాలీకి తామూ హాజారవుతామని ప్రకటించారు. ఆ వెంటనే అదే వేదిక మీద ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో కూడా ఇలాంటి ర్యాలీనే నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి కూడా హాజరవుతానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. మార్చ్ మొదటి వారంలో గాని, మూడవ వారంలో గాని చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలు పెర్కొన్నాయి.
Full View