మాజీ మంత్రి - నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ భవితవ్యం తేలినట్లే కనిపిస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి అక్కడే అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. అమెరికాలో మంత్రితో చర్చలు పూర్తిచేసుకున్న కోమటిరెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి చేరుకుంటారని, ఆ తర్వాత నల్లగొండకు వెళతారని సమాచారం. ఈ సందర్భంగా మొదటిసారి వెంకటరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టు తెలిసింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన కాకముందూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ వార్తలు తెరమీదకు రావడం, కోమటిరెడ్డి వాటిని ఖండిస్తూ వస్తుండటం జరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని అంటున్నారు. ఆయన అనుచరులు టీఆర్ ఎస్ లో చేరిపోతుండడంతో కోమటిరెడ్డికి ఒకింత ఒంటరయ్యారు. పైగా జిల్లాల్లోని కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు సైతం ఇబ్బందులు పెడ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ ఎస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కేడర్ - అనుచరులు టీఆర్ ఎస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ లో ఉంటూ రాజకీయంగా ఎదగడం కష్టమని ఆయన కుటుంబ సభ్యులు కోమటిరెడ్డికి చెప్పినట్టు తెలిసింది. స్వయానా బంధువైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ను టీఆర్ ఎస్ లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి చేరికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వ్యతిరేకించడం లేదని తెలుస్తోంది. అయితే టీఆర్ ఎస్ లో చేరే విషయమై కోమటిరెడ్డి స్పందించలేదు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.