500 కోట్లు కేసీఆర్ తీసుకొచ్చినా గెలుపు నాదే

Update: 2017-11-09 10:33 GMT
తెలంగాణ అధికారప‌క్షం చెల‌రేగిపోతున్నా.. కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు హ‌వా కొన్ని చోట్ల సాగుతుంటుంది. అలా ప్ర‌జాభిమానం ఉన్న నేత‌ల్లో న‌ల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా లాబీల్లో చిట్ చాట్ మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా. కేసీఆర్ ను ఉద్దేశించి అక్బ‌రుద్దీన్ పొగిడేసిన తీరును త‌ప్పు ప‌ట్టారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశారంటూ  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ ను న‌ల్గొండ‌లో పోటీ చేయ‌మంటున్నాన‌ని.. ఒక‌వేళ తానే గ‌జ్వేల్ నుంచి పోటీ చేస్తాన‌న్నారు. న‌ల్గొండ‌లో రూ.500 కోట్లు ఖ‌ర్చు పెట్టి కేసీఆర్ బ‌రిలో దిగినా తానే గెలుస్తానని ఆత్మ‌విశ్వాసంతో చెప్పారు.

న‌ల్గొండ‌కు నిధులు ఇస్తే త‌న‌కూ సంతోష‌మేన‌ని.. సీఎంకు థ్యాంక్స్ చెబుతూ యాడ్ వేస్తాన‌ని చెప్పారు. మూడున్న‌రేళ్ల‌లో గ‌జ్వేల్‌.. సిద్దిపేట‌.. సిరిసిల్ల‌కు నిధులు ఇచ్చి.. ఇప్పుడు న‌ల్గొండ‌లో ఖ‌ర్చు పెడితే త‌న‌కు సంతోష‌మేన‌న్నారు. కేసీఆర్ ఖ‌ర్చుచేసేదంతా ఎన్నిక‌ల కోస‌మేన‌న్నారు.

తెలంగాణ ఉద్య‌మం చేయ‌ని మంత్రుల తుమ్మ‌ల‌.. త‌ల‌సానిల‌కు ప‌ద‌వులు ఇచ్చార‌ని.. తెలంగాణ కోసం పోరాడిన కోమ‌టిరెడ్డిని ఓడ‌గొట్టేందుకు నిధుల్ని ఖ‌ర్చు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. అక్బురుద్దీన్ ప్ర‌భుత్వాన్ని పొగిడితే త‌మ‌కేం ఇబ్బంది లేద‌ని.. ఆయ‌న‌ది న‌రం లేని నాలుకగా అభివ‌ర్ణించారు. రానున్న ఎన్నిక‌ల్లో తాను 50వేల మెజార్టీతో గెలుస్తానని. ఒక‌వేళ తాను చెప్పిన దాని కంటే త‌క్కువ మెజార్టీ వ‌స్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు
Tags:    

Similar News