బాపట్ల ప్లీనరీలో కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పదవులు రాలేదని రెడ్లు బాధపడవద్దని కూడా అంటున్నారీయన. జగన్ అధికారంలో ఉన్నంత కాలం రెడ్లదే రాజ్యం అని కూడా చెబుతున్నారు. రాజ్యాంగ సంబంధ పదవుల్లో ఉండి పార్టీ అనుబంధం తెంచుకుని పనిచేయాలి. కానీ ఇక్కడ స్పీకర్ సీతారాం కానీ లేదాడిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కానీ ఇందుకు విరుద్ధంగా పార్టీ కండువాలతోనే జనంలోకి పోతున్నారు.
కోన రఘుపతి మాటలెలా ఉన్నా అభివృద్ధి అయితే మాత్రం నియోజకవర్గంలో లేదని తేలిపోయింది. ఇష్టం వచ్చిన విధంగా పన్నులు వేసిన విధానానికి సొంత సామాజికవర్గంకు చెందిన కుటుంబాల వారే కోన రఘుపతిని నిలదీస్తూ ఉన్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి.
వైసీపీలో ఆయన హిస్టరీని పరిశీలిస్తే ఓ దశలో ఆయన్ను తప్పించేద్దాం అనుకున్నారు. ఆయనతో పాటు తలనొప్పిగా ఉన్న స్పీకర్ సీతారాంను కూడా తప్పించేద్దాం అనుకున్నారు కానీ కాలేదు.. ఎందుకని ? వైసీపీలో బ్రాహ్మణ సామాజికవర్గం లో ఎక్కువగా నాయకులు లేరు.
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కాస్త సినీ నేపథ్యం కూడా ఉందిలేండి. ఆయన బంధువే కోన వెంకట్ అనే రైటర్. సినిమా నేపథ్యం కూడా ప్లస్సే కదా తెలుగు రాజకీయాల్లో.
ఇక ఇటీవల కాలంలో చూస్కోతే న రఘుపతి అంటే వైసీపీ, వైసీపీ అంటే రఘుపతి అన్నవిధంగా మాట్లాడుతున్నారు. మొన్నటి నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో ఆయన మాటలను బట్టి మనకిదే అర్థమవుతుంది.! ఆయనకు ఈ పాటి కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో అన్నది తెలియదు కానీ మొత్తానికి వైసీపీ తాళాలు జగన్ తనకు ఇచ్చారని కూడా అంటున్నా రాయన.
అంటే గుంటూరు జిల్లా మొత్తం కోన రఘుపతి చేతిలోనే ఉందా ? లేదా కోన వారింటి అబ్బాయి ఏం చెబితే అదే గుంటూరులో నడుస్తుందా ? లోగుట్టు పెద్ద రెడ్లకు ఎరుక మరి.