మా చమురు మాకే అంటున్న కొనకళ్ల

Update: 2015-08-17 11:23 GMT
అప్పుడెప్పుడో దివంగత నేత వైఎస్ నోట వినిపించిన నినాదం లాంటి నినాదాన్నే తాజాగా టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా.. గోదావరి బేసిన్ లో నుంచి వెలికి తీసే చమురును.. తొలుత రాష్ట్ర అవసరాలకు తీర్చాలని.. ఆ తర్వాతే బయటకు ఇవ్వాలన్న డిమాండ్ ను కొనకళ్ల చేస్తున్నారు.

ఏపీ అవసరాలు తీరిన తర్వాతే బయటకు ఇవ్వాలని.. బయట రాష్ట్రాలకు తరలించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. చమురు తరలించే విషయంలో ఏపీ సర్కారు తక్షణమే ఆంక్షలు విధించాలని ఆయన కోరుతున్నారు. మరి.. కొనకళ్ల వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారో..? అయినా.. పెద్దోళ్ల సంగతిని కొనకళ్ల ఎందుకు కెలుకుతున్నట్లు..? వ్యాపార ప్రయోజనాలు తప్పించి.. మరెలాంటి విషయాల్ని పట్టించుకోని చమురు సంస్థలు ఏపీ అధికారపక్షం ఎంపీ తెర మీదకు తెచ్చిన నినాదానికి ఎలా రియాక్ట్ అవుతాయో..?
Tags:    

Similar News