తెలుగుదేశం - కాంగ్రెస్ - వైసీపీ పార్టీలన్నిటినీ చూసేసి ఇప్పుడు ఏ పార్టీలోనూ లేకుండా ఖాళీగా ఉన్న ఉత్తరాంధ్ర సీనియర్ లీడర్ - మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మళ్లీ యాక్టివేట్ అవుతున్నారు. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఆయన టీడీపీలో చేరుతారని గతంలో పలుమార్లు వినిపించినా అది జరగలేదు. అంతేకాదు, యాక్టివేట్ అయ్యేందుకు ఆయన చేసిన పలు ప్రయత్నాలూ సక్సెస్ కాలేదు. తాజాగా ఆయన ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు కేవలం రాజధాని అమరావతిపైనే ఫోకస్ చేయడం మానేసి అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో చేసిన తప్పులనే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని లేఖలో ప్రస్తావించారు. అమరావతి చుట్టూ ఏడు వైద్యసంస్ధలను తీసుకురావడం వల్ల..ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని ఆయన అన్నారు.
జిల్లాకో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి తీసుకువస్తామన్న హామీ నెరవేర్చాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. విశాఖలోని విమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చాలని కోరారు. త్వరలో ఉత్తరాంధ్ర సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో ప్రస్తావించారు. మొత్తానికి ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన ఆయన తన పూర్వ వైభవాన్ని సంపాదించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అయితే, ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది చూడాలి.