బుధవారం. 12 తేది. తదియ తిథి. ఇది చాలా మందికి కలిసివచచ్చే రోజని అంటారు. కొందరికి కలిసి రాకపోయినా.,.... హాని మాత్రం కలిగించదని అంటారు. పైగా చవితికి ముందు రోజు కూడా కావడంతో రాజకీయంగా ఎలాంటి నీలాపనిందలు రావని అంటున్నారు. ఇవన్నీ ముహూర్త రీత్యా అయితే.... తెలంగాణలో ఇరు రాజకీయ పార్టీల నాయకుల అందుబాటులో ఉండే రోజు. అందుకని ప్రధాన పార్టీలలో చేరే వారి సంఖ్య బుధవారం ఎక్కువగానే ఉండేలా ఉంది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఇక్కడ జరుగనున్న రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. దీంతో ఆయన సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొందరు అసంత్రప్త నాయకులు, టిక్కట్లు దక్కని మరికొందరు నాయకులు బుధవారం నాడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి పార్టీలో కీలక పదవులు పొందిన డి.శ్రీనివాస్ కూడా ఉన్నారని అంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై అలిగి డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అక్కడ ఆయనకు సముచిత స్థానం ఇచ్చి రాజ్యసభకు పంపారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం.... ఒక కుమారుడు భారతీయ జనతా పార్టీలో చేరడంతో డి.శ్రీనివాస్ కు ప్రాధాన్యం తగ్గింది. ఇది గమనించిన డి.శ్రీనివాస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల వేళ తిరిగి సొంత గూటికి చేరాలని భావిస్తున్నారు. దీనికి బుధవారం ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం.
ఇక వరంగల్ కు చెందిన పాత కాపులు కొండా దంపతులు కూడా బుధవారమే కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు విడుదల చేసిన తొలి జాబితాలో కొండా సురేఖ - కొండ మురళీలకు టిక్కట్లు దక్కలేదు. దీంతో అలిగిన కొండా దంపతులు బుధవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం - ఇతర పార్టీలలో ఉన్న కొందరు నాయకులు బుధవారం నాడే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే అలాంటి నాయకులందరూ వారివారి నియోజకవర్గాలకు చెందిన సీనియర్లతో సంప్రదింపులు జరిపి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో ప్రగతి భవన్ లో కారు ఎక్కాలనుకుంటున్నారు. సో.... బుధవారం తెలంగాణలో జంపింగ్ జపాంగ్ లు ఎక్కువగానే ఉండేలా ఉందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.