కొండా సురేఖ టీఆర్ ఎస్‌ కు గుడ్ బై చెప్పేస్తున్నారట‌

Update: 2017-11-03 12:54 GMT
ప్రతిప‌క్షాలు స‌రైన రీతిలో బ‌లంగా లేవ‌నే అంచ‌నాలు ఓ వైపు...పార్టీలో చేరిక‌ల‌తో సంద‌డి మ‌రోవైపు ఉండ‌టంతో... ఉత్సాహంగా ఉన్న తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ గురించి ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేని వార్త ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. టీఆర్ ఎస్‌ పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త అసంతృప్తి కొత్త మ‌లుపు తిరిగింద‌ని అంటున్నారు. ఒక‌ట్రెండు జిల్లాల్లో పార్టీ నేత‌ల్లో నెల‌కొన్న అసంతృప్తి తారాస్థాయికి చేరింద‌ని, పార్టీలో ఇమ‌డ‌లేని నేత‌లు సొంత దారి చూసుకుంటున్నార‌ని ప్ర‌చారం జరిగింది. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ వీడ‌నున్న‌ట్లు పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి.

టీఆర్ ఎస్‌ లోని అంత‌ర్గ‌త పోరును త‌ట్టుకోలేక ఎమ్మెల్యే కొండా సురేఖ - ఆమె భ‌ర్త కొండా ముర‌ళి దంపతులు టీఆర్‌ ఎస్‌ ను వీడి సొంతగూడు అయిన‌ కాంగ్రెస్‌ లో చేరుతున్నట్టు ప్రచారం సాగింది. సురేఖ త‌న‌ కుమార్తె సుస్మితా పటేల్ తన రాజకీయ వారసురాలని గ‌తంలోనే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ వార్త హ‌ల్‌ చ‌ల్ చేసింది. వరంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం - ప‌ర‌కాల‌లో పోటీ చేయించేందుకు కాంగ్రెస్‌ తో సురేఖ చ‌ర్చ‌లు జ‌రిపార‌ని...త్వ‌ర‌లో ఆమె పార్టీ మార‌నున్నారనే ప్ర‌చారం సాగింది. వచ్చే ఎన్నికల్లో సుస్మిత పోటీ చేసే విషయంపై కాంగ్రెస్ పార్టీతో సురేఖ‌ కీల‌కంగా చ‌ర్చించిందని చ‌ర్చ‌లు సాగాయి. ఈ ప‌రిణామం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టించింది.

ఈ నేప‌థ్యంలో సురేఖ మీడియాతో మాట్లాడారు. తాను టీఆర్ ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని సురేఖ‌ తేల్చి చెప్పారు. తనకు దివంగత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ జన్మనిస్తే - సీఎం కేసీఆర్ పునర్జన్మ ఇచ్చారని ఆమె తెలిపారు. తాను పార్టీని వీడుతున్నట్టు కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎప్పుడో చచ్చిపోయిందని.. చచ్చిపోయిన పార్టీలో నేనెలా చేరుతానని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు, నాయకులే తనపై ఈ అసత్య ప్రచారానికి ఒడిగట్టారని - పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ కావాలనే మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారన్నారు. త‌మకు రాజకీయ జన్మనిచ్చింది దివంగ‌త సీఎం వైఎస్‌ ఆర్‌...అయితే రాజకీయ పునర్జన్మనిచ్చింది మాత్రం కేసీఆర్‌ అని, కడదాక టీఆర్‌ ఎస్‌ లోనే కొనసాగుతామంటూ వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News