రౌండప్ కేసీఆర్.. అందరి టార్గెట్ అదే..

Update: 2018-10-06 11:41 GMT
టీఆర్ ఎస్ అధినేత ఒకవైపు .. మిగతా కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - బీజేపీ మరోవైపు.. ఇప్పుడందరూ గులాబీ బాస్ ను రౌండప్ చేశారు. ఎన్నికల సభలో కేసీఆర్ అన్న మాటలకు ప్రతిస్పందనగా తెలంగాణలో అందరు నేతలు నోరుపారేసుకోవడం చూశాక ఇదే అనిపిస్తోంది.

ఈరోజు గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తనపై విమర్శలు చేసిన కేసీఆర్ పై దారుణ విమర్శలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మీడియా ముందుకొచ్చి హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ - బీజేపీ నేత లక్ష్మన్ కూడా కేసీఆర్ ను టార్గెట్ చేసి తిట్టిపోశారు. తాజాగా వరంగల్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కొండా సురేఖ .. కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసేలా.. కాంగ్రెస్ కు మేలు చేసేలా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను కేసీఆర్ తిట్టారని.. ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేదా అని మండిపడ్డారు. పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని ఆడిపోసుకున్నారు. దురహంకారంతో విర్రవీగుతున్న టీఆర్ ఎస్ కు బుద్ది చెప్పేందుకే మహాకూటమి ఏర్పడిందని.. తనను ఆడబిడ్డలా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.కేసీఆర్ తనలా ప్రశ్నించే వారిని బయటకు పంపుతున్నాడని కొండా సురేఖ ఆడిపోసుకున్నారు..

ఇలా కేసీఆర్ ఎన్నికల సభలో ఒక మాట అంటే అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ - బీజేపీ నేతలు కూడా రౌండప్ చేస్తున్నారు. తీవ్ర విమర్శలతో యుద్ధం మొదలుపెట్టారు. మహాకూటమి ఏర్పాటు కేసీఆర్ ను ఓడించడానికేనని కొండా కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఇన్ని పార్టీలు - కూటములు మధ్య కేసీఆర్ విజయం సాధిస్తారా.? వీరందరిని చిత్తు చేస్తాడా    అన్నది వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News