ఈ కొండ ఏమిటి? ఆ కొండ ఏమిటి? ఓ కొండ ముందు ఇంకో కొండ చిన్నబొయిందా? తలొంచేసిందా? అసలు ఈ కొండల గోలేమిటి అనుకుంటున్నారా?. వినడానికి కాస్తంత ఎబ్బెట్టుగానే అనిపించినా... ఈ వ్యవహారం గురించిన పూర్తి వివరాలు తెలిస్తే మాత్రం ఆసక్తి కలగడం ఖాయమే. సరే మరి... అసలు విషయంలోకి వెళ్లిపోదాం పదండి. కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తున్నారు కదా. తొలుత పారిశ్రామిక వేత్తగా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న విశ్వేశ్వరరెడ్డి... ప్రజా సేవలో మరింత చొరవ చూపాలన్న ఆశతో రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ లో చేరిపోయాఃరు. వికారాబాద్ ఎంపీగా గెలిచి సత్తా చూపించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినాయకత్వంతో విభేదాలు వచ్చి.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు టీఆర్ఎస్ కు షాకిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే రెండో సారి ఎన్నికల్లో ఓటమి దక్కడంతో ఆయన ఎక్కడా కనిపించడం లేదు.
అయితే తన పూర్వాశ్రమం బిజినెస్ లోకే తిరిగి ఎంట్రీ ఇచ్చేసిన కొండా... ఇటీవల ఓ సాహస యాత్రకు పూనుకున్నారట. అది కూడా ట్రెక్కింగ్ లాంటి ఓ అడుగడుగునా ఒళ్లు గగుర్నపొడిచే విన్యాసాలు చేయాల్సిన యాత్రను ఎంచుకున్నారట. ఈ యాత్రలోమరికొందరు వ్యక్తులతో కలిసి కొండా ట్రెక్కింగ్ కు వెళ్లారట. సంక్షిష్టమైన దారులతో, ఒళ్లు గగుర్పొడిచేలా ఏటవాలుగా ఉండే మార్గాలతో ఆద్యంతం ప్రమాదకరంగా ఉండే అత్యంత కఠినమైన కలావంతిన్ దర్గ్‌పై ఆయన విజయవంతంగా ట్రెక్కింగ్ చేశారు. మహారాష్ట్రాలో రాయిఘడ్ జిల్లాలోని కలావంతిన్ దర్గ్‌పై ట్రెక్కింగ్ చేసిన ఫోటోలను కొండా విశ్వేశ్వరరెడ్డి తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
దారులు భయంకరంగా ఉన్నా, శారీరకంగా అలసిపోయినా, ఈ ట్రెక్కింగ్ మంచి అనుభూతినిచ్చిందని కొండా తన ట్రెక్కింగ్ అనుభూతులను పేర్కొన్నారు. కొండా ట్వీట్ ను చూసిన చాలా మంది ఈ కొండనెక్కాలంటే.. కొండంత ధైర్యం ఉండాలంటూ నెటిజన్లు విశ్వేశ్వరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పశ్చిమ కనుమల్లోనే అత్యంత ప్రమాదకరమైన ఈ కొండపై ట్రెక్కింగ్‌కి వెళ్లి 2016లో హైదరాబాద్‌కి చెందిన 27 ఏళ్ల రచిత గుప్త అనే యువతి మృతిచెందారు. మరణించిన 10 రోజుల అనంతరం ఆమె మృతదేహం లభ్యమైంది. 2018లో పూణేకి చెందిన 28 ఏళ్ల చేతన్ దండే అనే ట్రెక్కర్ కొండ అంచు, ఇంకా 15 అడుగుల దూరంలో ఉండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందారు. ఇలాంటి ప్రమాదకర ప్రాంతాన్ని కొండా తన ట్రెక్కింగ్ కు ఎంచుకోవడం సాహసమేనని చెప్పాలి.