ఆంజనేయ స్వామి కొలువై ఉన్న తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టుకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. హనుమంతుడు లంకకు వెళ్లేముందర ఇక్కడ సేదతీరాడని చెబుతుంటారు. ఈ కొండల్లో అంజన్న కొలువై ఉన్నాడని భక్తులు నమ్ముతారు. చుట్టూ కొండల మధ్యన అంజన్న దేవాలయం ఆహ్లాదకరంగా ఉంటుంది. హనుమాన్ జయంతికి ఎక్కడెక్కడి నుంచో లక్షల మంది మంది ఇక్కడికి వచ్చి మాలధారణ, విరమణ చేస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న క్షేత్రంలో ఈ మధ్యే మరణ మృందంగం వినిపించింది. కొండగట్టు గుట్టల నుంచి ఘాట్ రోడ్ మీదుగా కిందకు వస్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 60మంది చనిపోగా.. 20 మంది వరకూ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కొండగట్టు విషాదంపై దేశప్రధాని మోడీ - రాష్ట్రపతి కూడా ట్విట్టర్ లో సానుభూతి తెలిపారు.
అయితే ఈ ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే కొండగట్టులో ఈ మధ్య చేసిన పనే ఈ చావులకు కారణమనే చర్చ మొదలైంది. హనుమంతుడికి కోపం వచ్చే సరిగ్గా 60మంది చావుకు కారణమైందనే ప్రచారం ఊపందుకుంది..ఇంతకీ కొండగట్టు అంజన్నకు కోపం ఎందుకొచ్చిందంటే..
కొండగట్టు నిండా కోతులే ఉంటాయి. అక్కడికి వచ్చే భక్తులు.. వానరాలకు తిండి, ఆహార పదార్థాలు, అరటి పండ్లు పంచుతుంటారు. కొండపై, దేవాలయంలో విపరీతంగా ఉండే వానరాలు భక్తుల సంచులు - తినుబండారాలను ఎత్తికెళ్లి తింటుంటాయి. కానీ హనుమాన్ కు ప్రతిరూపమైన ఈ వానరాలను ఎవ్వరూ ఏమీ అనరు అక్కడ. దాడులు చేసినా సర్దుకుంటారు.
అయితే కోతుల బెడదను తట్టుకోలేని కొందరు ఈ మధ్య ఘతుకానికి పాల్పడ్డారు. కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని గోవిందారం దారి పక్కన 60 కోతుల కళేబరాలు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ షాక్ పెట్టి కోతులను హతమార్చినట్టుగా ఉందని కొడిమ్యాల అటవీ రేంజర్ బుర్ర లత అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే బస్సు ప్రమాదం జరిగి అంతేస్థాయిలో 60మంది ప్రాణాలు పోవడం సంచలనంగా మారింది. కోతుల కళేబరాలు లభ్యమైన సంఖ్యలోనే ప్రయాణికులు చనిపోవడం అంజన్న శాపమేనని స్థానిక గ్రామాల్లో ప్రచారం మొదలైంది. కోతులను చంపడంతోనే అంజన్నకు కోపం వచ్చి మనుషుల ప్రాణాలు తీశాడని పరిసర గ్రామాల ప్రజలు మీడియా ఎదుట కథలు కథలుగా చెబుతున్నారు. దేవుడికి కోపం వచ్చిందో.. లేక కోతుల ఉసురు తాకిందో కానీ ఇప్పుడు ఈ 60మంది మరణం.. కోతుల మరణానికి లింక్ ఉందని ప్రచారం ఊపందుకుంది. ఆ 60మంది కుటుంబాలు మాత్రం శోకసంద్రంలో ఉండిపోయాయి. .