`కొండగట్టు` రోడ్డు ప్రమాదం .....భారత దేశ చరిత్రలో అతి ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి 60కి చేరుకుంది. ఇప్పటికే ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయినందునే ఈ ప్రమాదం జరిగిందని....ఈ ప్రమాదానికి డ్రైవర్ కారణం కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆ అభిప్రాయాలను బలపరుస్తూ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఘోర ప్రమాదం జరగడానికి కారణం...బ్రేకులు ఫెయిల్ కావడమేనని...ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఓ బాలిక వెల్లడించింది. అంతేకాకుండా, బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయిన సంగతిని ప్రయాణికులకు డ్రైవర్ వెల్లడించారని, దూకేయదలచిన వారు దూకేయాలని సూచించారని ఆ బాలిక తెలిపింది.
కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ కు చెందిన బాలిక సోమిడి అర్చన (13)...తన తల్లి పుష్పతో కలిసి జగిత్యాల వెళ్లేందుకు ప్రమాదానికి గురైన బస్సెక్కింది. అనూహ్యంగా జరిగిన ఆ ప్రమాదంలో అర్చన తల్లి తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పుష్ప మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ అర్చన కోలుకొని...ప్రమాదం జరిగిన తీరును వివరించింది. బస్సు ప్రమాదానికి బ్రేకులు ఫెయిలవడమే కారణమని అర్చన తెలిపింది. బ్రేకులు ఫెయిలయ్యాయని, దూకేవారు దూకేయాలని డ్రైవర్ గట్టిగా అరిచి చెప్పారని అర్చన చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత ఓ వ్యక్తి బస్సు నుంచి దూకేశాడని చెప్పింది. ఆ తర్వాత తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు పెద్దగా కేకలు వేస్తూ ఒకరిపై ఒకరు పడిపోయారని తెలిపింది. ఆ తర్వాత బస్సు ఆ గోతిలోకి పడిపోయిందని చెప్పింది . అయితే, అంతకుముందు, తనతల్లికి - కండక్టర్ కు మధ్య గొడవైందని - తాము దిగిపోతామని చెప్పినా ఆయన వినిపించుకోలేదని వివరించింది. బస్సు ఆపి ఉంటే తన తల్లి తనకు దక్కి ఉండేదని బోరున విలపించింది.