టీడీపీలోకి కోట్ల..వైసీపీలోకి కేఈ కృష్ణమూర్తి

Update: 2019-01-29 04:22 GMT
మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేర‌డ‌మనే ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌నుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరుపై కోట్ల గత కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ తీవ్రంగా నష్టపోతుందని విజయవాడ సమావేశంలో వాదించిన కోట్ల, కీలక సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చేశారు. టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. కోట్లను టీడీపీలో చేర్చుకునే విషయంలో చంద్రబాబు స్వయంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, ఈ చ‌ర్చ‌ల ఫ‌లితంగానే - టీడీపీ నేత కేఈ కృష్ణ‌మూర్తి పార్టీకి గుడ్‌ బై చెప్ప‌నున్నార‌ని అంటున్నారు.

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం  సీఎం చంద్రబాబుతో భేటీ అవటంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కినుక వహించారు. ఎందుకంటే... కోట్ల  పార్టీలో చేరటానికి  చంద్రబాబు ముందు పెట్టిన డిమాండ్లలో డోన్ సీటు. కోట్ల పార్టీలో చేరితే డోన్ నుంచి ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై పీఠముడి పడనుంది. డోన్ నుంచి కోట్ల సుజాతమ్మను - కానీ తన కుమారుడు రాఘవేంద్రను కానీ  బరిలో దించాలని కోట్ల ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే, చాలా కాలంగా కేఈ కుటుంబం డోన్ నుంచి పోటీ చేస్తోంది.  జిల్లాలో కోట్ల - కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా  వైరం ఉంది. కోట్ల పార్టీలో చేరిన తర్వాత జిల్లాలో ఎలాంటి ప్రభావం ఉంటుందోనని టీడీపీ శ్రేణులు వేచి చూస్తున్నాయి.

కాగా, కోట్ల వర్గం సీఎంతో  భేటిపై  ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసారు. కోట్ల టీడీపీలో చేరికపై నాకు సమాచరం లేదని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. మ‌రోవైపు ఢోన్ సీట్ల‌ కోట్లకు ఇస్తుండ‌ట‌డంతో కేఈ మనస్థాపం చెందార‌ని స‌మాచారం. దీంతో త‌న కుమారుడు కేఈ శ్యామ్ బాబు కోసం కేఈ వైసీపీలో చేరనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.
Tags:    

Similar News