జనవరి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ!

Update: 2020-10-11 17:30 GMT
అమెరికా ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. అమెరికాలో వచ్చే జనవరి నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అధికారి - డాక్టర్ రాబర్ట్ కాడ్ లేక్ ప్రకటించారు.

సురక్షితమైన సమర్థవంతమైన టీకా మందు డిసెంబర్ లోగా ఆమోదం పొందవచ్చునని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే పంపిణీకి కొంత సమయం పడుతుందన్నారు.

జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారానికి ఈ టీకా మందు మార్కెట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని క్టర్ రాబర్ట్ కాడ్ లేక్ తెలిపారు.

ఎమర్జెన్సీ ఆథరైజేషన్ కి కొంత సమయం పడుతుందని.. అయితే ట్రంప్ మాత్రం ఈ నెల నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించడం విశేషం.

    

Tags:    

Similar News