మామా అల్లుళ్ల మ‌ధ్య చీలిక తెచ్చిన కాంగ్రెస్ పార్టీ

Update: 2018-11-14 06:50 GMT
కాంగ్రెస్ పార్టీలో సీట్ల గొడవ తారాస్థాయికి చేరింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీని కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ విమ‌ర్శిస్తున్న‌ప్ప‌టికీ - ఆయా పార్టీల నేత‌లు త‌మ‌దైన శైలిలో ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. అయితే, దీనికి భిన్నంగా సీటు నీకా.. నాకా.. అంటూ మామ - అల్లుడు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలం అయిన అనంత‌రం మామా అల్లుళ్లు టార్గెట్ చేసుకొని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ - ఆయన సొంత అల్లుడు - ఓయూ విద్యార్థి జేఏసీ నేత అయిన‌ మన్నె క్రిశాంక్ మధ్య ఈ పోరు సాగుతోంది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా క్రిశాంక్ పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ చివరి క్షణాల్లో క్రిశాంక్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకుండా పోయింది. నాటి నుంచి క్రిశాంక్.. ఆ నియోజకవర్గంలో ఉండి రాబోయే ఎన్నికల్లో తానే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నాడు. అయితే క్రిశాంక్‌కు పోటీగా ఆయన మామ సర్వే సత్యనారాయణ కూడా కంటోన్మెంట్ టికెట్‌ను ఆశిస్తున్నాడు. కంటోన్మెంట్ నుంచి క్రిశాంకే పోటీ చేస్తారని ఆయన అనుచరులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
నుంచి పోటీ చేసేందుకు సర్వే సత్యనారాయణ తీవ్రంగా ప్రయత్నం చేసి విజ‌య‌వంతం అయిన సంగ‌తి తెలిసిందే. ఇదే స్థానం నుంచి బరిలో దిగాలని సర్వే అల్లుడు మన్నె క్రిశాంక్ కూడా గట్టిగా ప్రయత్నాలు చేసిన‌ప్ప‌టికీ నిరాశే ఎదురైంది.

ఈ నేప‌థ్యంలో క్రిశాంక్ మీడియాలో మాట్లాడుతూ తాను 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని వెల్ల‌డించారు. ఓయూ జేఏసీ అధికారి ప్రతినిధిగా పని చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లాను. 2014లో కాంగ్రెస్ నుంచి తనకు టికెట్ ఇస్తామని చెప్పి చివరి క్షణాల్లో రాకుండా చేశారు. జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన తాను లెక్చరర్‌గా పని చేస్తున్నాను. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని భావించి.. లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. తన మామ కంటోన్మెంట్ స్థానం కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేసుకొని టికెట్ సాధించార‌ని అన్నారు. ఆయన లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయొచ్చు కానీ ఇక్కడ ఎందుకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. న్యాయం ప్రకారం కంటోన్మెంట్ టికెట్ తనకే ఇవ్వాలని, తనకు రాహుల్ గాంధీ-  కొప్పుల రాజు - భట్టి విక్రమార్క - ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్ర‌య‌త్నించాల‌ని సూచించిన‌ప్ప‌టికీ  ఫ‌లితం రాలేద‌న్నారు. తాను ఇండిపెండెంట్ అభ్య‌ర్థి గా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాగా, మామాఅల్లుళ్ల మ‌ధ్య పంచాయ‌తీ పెట్టింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News