ట్రంప్‌ కు మోడీకి తేడా లేదంటున్న బీజేపీ నేత‌

Update: 2017-06-26 16:29 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తేడా లేదంటున్నారు బీజేపీకి చెందిన సీనియ‌ర్‌ నేత‌. అమెరికా అధ్య‌క్షుడితో మోడీ భేటీ సంద‌ర్భంగా తెలంగాణ బీజేపీ అధికార ప్ర‌తినిధి కృష్ణ‌సాగ‌ర్ రావు ఈ మేర‌కు త‌న అభిప్రాయాల‌ను ఓ బ్లాగ్‌లో పంచుకున్నారు. వాళ్లిద్ద‌రికీ ఒకే ర‌క‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌పంచం ప‌ట్ల వారి ఆలోచ‌న దోర‌ణి, వివిధ అంశాల్లో నిర్ణ‌యం తీసుకునే తీరు, ప‌రిపాల‌న అంశాలు, అంత‌ర్జాతీ ప‌రిణామాల్లో ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఒకే ర‌క‌మైన ఆలోచ‌న తీరు ఉంద‌ని విశ్లేషించారు.

మీడియా, న్యాయ‌వ్య‌వ‌స్థ తీరు, కార్య‌నిర్వాహ‌క వ‌ర్గం ప‌నితీరు త‌దిత‌ర అంశాల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే ర‌క‌మైన ఆలోచ‌న తీరును క‌లిగి ఉన్నార‌ని కృష్ణ‌సాగ‌ర్ రావు పేర్కొన్నారు. చాయ్‌ అమ్ముకునే వ్య‌క్తిగా అత్యంత సామాన్య‌మైన జీవితం గ‌డిపిన న‌రేంద్ర మోడీ పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగార‌ని తెలిపారు. అనంత‌రం అనేక ల‌క్ష‌లాది మ‌న‌సులు గెల‌చుకోవ‌డంతో పాటుగా ప్ర‌ధాన‌మంత్రి పీఠాన్ని అధిరోహించార‌ని ప్ర‌స్తావించారు. అదే రీతిలో త‌న సొంత వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్న ట్రంప్ క్రియాశీల రాజ‌కీయాల్లో లేక‌పోయిన‌ప్ప‌టికీ, భారీ స్థాయిలో మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకొని అగ్ర‌రాజ్య అధిప‌తి కాగ‌లిగార‌ని కృష్ణ‌సాగ‌ర్ రావు ప్ర‌శంసించారు.

డొనాల్డ్ ట్రంప్‌, న‌రేంద్ర మోడీ ఇద్ద‌రు ప్ర‌త్యేక‌మైన రాజ‌కీయ‌వేత్త‌లేన‌ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘ‌న‌త ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌కు ద‌క్కింద‌ని కృష్ణ‌సాగ‌ర్ రావు విశ్లేషించారు. ఈ ఇద్ద‌రు నేత‌లు వేర్వేరు దేశాల్లో ఉన్న‌ప్ప‌టికీ విశిష్ట‌మైన ల‌క్ష్యాన్ని అధిరోహించిన ఆలోచ‌న తీరు వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త కుదురుతుంద‌ని ఆయ‌న ఆకాంక్షించారు. భ‌విష్య‌త్తులో ఇరుదేశాల మ‌ధ్య మైత్రి పెరిగేందుకు కూడా దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News