వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయటానికి డార్లింగ్ ప్రభాస్ సిద్ధమవుతున్నట్లుగా ఒక ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ తురుపుముక్క మాదిరి ప్రభాస్ ను వాడేస్తుందన్న వాదన ఉంది. అయితే.. ఈ వాదనను కొట్టిపారేస్తూ.. ఎన్నికల్లో ప్రభాస్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చేశారు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు.
ప్రభాస్ రాజకీయాల్లోకి రావటానికి మరింత సమయం ఉందన్న ఆయన.. ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాడన్నారు. ఈ సమయంలో ప్రభాస్ ను బీజేపీ ఎన్నికల ప్రచారంలో వాడుకోదలుచుకోలేదన్నారు. ప్రభాస్ ఎన్నికల ప్రచారంపై స్పష్టత ఇచ్చిన కృష్ణంరాజు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజల్ని మోసం చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారని.. త్వరలోనే బాబు పాపం పండటం ఖాయమన్నారు.
1998 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటి కన్నా.. బీజేపీతో కలిసి పోటీ చేసిన 1999 ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని.. టీడీపీ మాత్రం బీజేపీ కారణంగా నష్టపోయినట్లుగా ప్రచారం చేయటాన్ని ఆయన తప్పు పట్టారు. పార్టీ అగ్రనాయకత్వం తనను ఎన్నికల బరిలో దిగాలని ఆదేశిస్తే.. ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని కృష్ణంరాజు వెల్లడించారు.