ఐటీ వారికి కేటీఆర్ స‌ల‌హా రాంగ్ టైమింగా?

Update: 2017-08-07 08:27 GMT
స‌మ‌స్య‌ల సుడిగుండంలో కిందా మీద ప‌డుతున్న వారికి సాంత్వ‌న క‌లిగే మాట చెప్పాలి. అది సాధ్యం కాకుంటే కామ్ గా ఉన్న ఫ‌ర్లేదు. అంతేకానీ.. కెలికిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తేనే ఇబ్బంది అంతా. మ‌రి.. తెలిసి చేశారో.. తెలియ‌కుండా చేశారో కానీ తాజాగా తెలంగాణ‌రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఒక స‌ల‌హా మీద మండిపాటు వ్య‌క్త‌మ‌వుతోంది.

ఐటీ ఉద్యోగుల‌కు మంత్రి కేటీఆర్ ఇచ్చిన స‌ల‌హా మంచిదే.కానీ.. రాంగ్ టైమింగ్ లో చెప్ప‌టం ఒక లోపంగా చెప్పాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఐటీ ఉద్యోగులంతా విప‌రీత‌మైన ఫ‌స్ట్రేష‌న్ లో ఉన్నారు. గ‌డిచిన కొద్దికాలంగా ఐటీ ఉద్యోగుల‌కు బ్యాడ్ టైం న‌డుస్తోంది. ఈ కంపెనీ అని కాదు ఆ కంపెనీ అని కాదు..ఐటీ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని.. త‌మ సౌక‌ర్యాల‌కు కోత పెడుతున్నార‌ని.. జీతాల పెంపు విష‌యంలో మ‌హా జిడ్డుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఓప‌క్క జీఎస్టీ మోత‌తో త‌మ బ‌డ్జెట్ మీద తీవ్ర ప్ర‌భావం చూపిస్తుందన్న బాధ‌లో ఉన్న వారికి.. కంపెనీలు త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రి.. రోజురోజుకి త‌గ్గుతున్న ఉద్యోగ భ‌ద్ర‌త‌తో విప‌రీత‌మైన ఫ‌స్ట్రేష‌న్ ఐటీ ఉద్యోగుల్లో క‌నిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. ఐటీ ఉద్యోగులు వారంలో ఒక‌రోజు చేనేత వ‌స్త్రాల్ని ధ‌రించాల‌న్న సూచ‌న‌ను చేశారు మంత్రి కేటీఆర్‌. చేనేత‌ను ప్ర‌మోట్ చేసే బాధ్య‌త‌ను తీసుకున్న కేటీఆర్‌.. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా.. చేనేత‌ను విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ఉద్యోగులంతా వారంలో ఒక‌రోజు చేనేత‌ను ధ‌రించాల‌న్న పిలుపునివ్వ‌టం.. అది కాస్తా మూణ్నాళ్ల ముచ్చ‌ట‌గా మారింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు చేనేత వ‌స్త్రాల ధ‌రించే విష‌యంలో మంత్రి మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. ఐటీ ఉద్యోగుల్ని చేనేత వ‌స్త్రాల్ని వారంలో ఒక రోజు ధ‌రించాల‌న్న మాట‌పై ఐటీ ఉద్యోగులు ప‌లువురు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. కంపెనీల నుంచి తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఏ ప్ర‌భుత్వాలు రియాక్ట్ కావ‌ని.. కానీ.. అవి చేయండి.. ఇవి చేయండంటూ స‌ల‌హాలు మాత్రం ఇస్తారంటున్నారు. మంత్రి కేటీఆర్ మంచి సూచ‌నే చేసినా.. రాంగ్ టైంలో చేశార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News