ఘాటైన విమర్శలు.. అదరగొట్టే ఆరోపణలు రాజకీయాల్లో మామూలే. కాకపోతే.. తాజా గ్రేటర్ ఎన్నికల్లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సవాలు.. ప్రతిసవాలుతో గ్రేటర్ ఎన్నికల ఆరంభంలోనే వాతావరణం వేడెక్కిపోయేలా చేస్తోంది. ఒక రోజు వ్యవధిలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు బస్తీమే సవాల్ అన్నట్లుగా ఒకరికి మించి మరొకరు సవాలు.. ప్రతిసవాలు చేసుకోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా సవాళ్లు.. ప్రతి సవాళ్ల విషయంలో ఒకరు వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. కానీ.. తాజాగా సవాళ్లు విసురుకున్న ఇద్దరూ మొండి ఘటాలే కావటం. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు కీలకం కావటంతో.. ఈ సవాళ్ల వ్యవహారం ఎలాంటి మలుపులకు కారణమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ సవాళ్ల పర్వానికి తెర తీశారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము విజయం సాధించటం పక్కా అని.. గ్రేటర్ కోట మీద గులాబీ జెండా ఎగురుతుందని ఢంకా బజాయించి మరీ చెప్పిన ఆయన.. వందకు పైగా స్థానాల్లో తాము విజయం సాధిస్తామని సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. గ్రేటర్ లో తాము కానీ గెలవకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాలు విసిరారు.
దీనికి ప్రతిగా టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తన ప్రసంగం మొత్తాన్ని వాడీ వేడిగా సాగటం గమనార్హం. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన ఆయన.. చాలానే వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా గ్రేటర్ లో టీఆర్ఎస్ పార్టీ కానీ 100 స్థానాలు సాధిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని.. తెలంగాణ గడ్డను వదిలిపెడతానని భారీ శపధాన్ని చేశారు. దీంతో.. ఇద్దరు నేతలు ఇంత భారీగా ఒకరికి మించి మరొకరు ఛాలెంజ్ లు విసురుకోవటం ఆసక్తికరంగా మారింది.
మరి.. ఇద్దరి సవాళ్లలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓటమి పాలవుతారన్న చర్చ మొదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ వ్యవహారంలో ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా ఎలా అంటే.. వారి మాటలే దీనికి కారణం. కేటీఆర్ చెప్పింది గ్రేటర్ లో గెలుస్తామని.. గెలవకుంటే తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉంటే.. అధికారం చేపట్టటానికి అవసరమైనది కేవలం 76 డివిజన్లు మాత్రమే. ఇక.. రేవంత్ రెడ్డి సవాలు చూస్తే.. టీఆర్ఎస్ కు 100 సీట్లు కానీ వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు.
అంటే.. ఎవరికి వారు ఆవేశంతో మాట్లాడినట్లుగా.. భారీ శపధాలు చేసినట్లు పైకి కనిపించినా.. ఎవరికి వారు తమకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న వైనం లోతుగా చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ 75 స్థానాలు అసాధ్యమైతే కాదు. ఒకవేళ లెక్కలో తేడా వచ్చినా ఆపరేషన్ ఆకర్ష్ ఉండనే ఉంది. కేటీఆర్ ఛాలెంజ్ అంతా గ్రేటర్ మీద గులాబీ జెండా ఎగరటం మీద మాత్రమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇక.. రేవంత్ ఛాలెంజ్ మొత్తం కూడా టీఆర్ ఎస్ కు 100 స్థానాలు వస్తాయా? లేదా? అన్న అంశం మీదనే. 76 డివిజన్ల విషయంలోనే కిందామీదా పడుతున్న గులాబీ బ్యాచ్ కి.. 100 అంకె వస్తే పరిస్థితే లేదు. ఈ లెక్కన రేవంత్ సేఫ్. మొత్తంగా చూస్తే.. కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి రాదు. అదే విధంగా రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం చేపట్టి.. తెలంగాణ గడ్డను విడిచి పెట్టాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా.. భావోద్వేగంతో సవాళ్లు విసురుకున్నట్లు పైకి కనిపించినా.. లోతుల్లో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉన్నారో గమనించారా?