తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ భలే లాజిక్ పాయింట్ తీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం చేపట్టిన పలు నిరసన రూపాల్లో భాగంగా రైల్ రోకో చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా 2011లో మౌలాలీ రైల్వే జంక్షన్ వద్ద రైల్ రోకో కేసు విషయంలో సికింద్రాబాద్ రైల్ కోర్ట్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి - ఐటీ - మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు - ఎక్సైజ్ - క్రీడల శాఖ మంత్రి టి పద్మారావు తదితరులు హాజరయ్యారు. ఈ కేసులో ఏ1కేటీఆర్ కాగా - ఏ3 నాయిని - ఏ5 పద్మారావు ఉన్నారు.
ఈ కేసుకు హాజరవుతున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని సీన్ లోకి లాగారు. ``తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసు విచారణకు వెళ్తున్నాను. ఉద్యమం సమయంలోని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది కేంద్రప్రభుత్వం ఉద్యమ కేసులు ఎత్తివేయదా?`` అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.
రైల్వై కోర్టులో విచారణ ముగిసిన అనంతరం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. తాము రైల్వే జంక్షన్ కి వెళ్ళాం కానీ రైళ్లను ఆపలేదని, ఈ విషయాన్నే న్యాయమూర్తి దగ్గర చెప్పినట్లు వివరించారు. వచ్చే నెల 19 కి కేసు వాయిదా వేశారని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/