ఏపీలో వేలు పెట్టే లెక్క మార్చిన కేటీఆర్!

Update: 2019-02-26 03:35 GMT
తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ‌కు చుక్క‌లు చూపించిన చంద్ర‌బాబుకు నిద్ర లేకుండా చేయ‌ట‌మే కాదు.. తెలంగాణ అన్నంత‌నే జ‌డుపు పుట్టేలా చేయాల‌న్న‌ట్లుగా కేసీఆర్ డిసైడ్ అయిన వైనంపై ఇప్ప‌టికే ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన కేటీఆర్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వేలు పెడ‌తామ‌న్న సంకేతాల్ని ఇచ్చారు.

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో భాగ‌స్వామి అవుతార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల్లో ఒక దాన్ని ఉప‌సంహ‌రించుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఏపీలో నూటికి నూరు శాతం చంద్ర‌బాబు ఓడిపోతార‌న్న ధీమాను వ్య‌క్తం చేసిన కేటీఆర్.. ఏపీ రాజ‌కీయాల్లో తాము వేలు పెడ‌తామ‌న్న సంకేతాల్ని ఇచ్చారు.

కానీ.. తాజాగా మాత్రం అందుకు భిన్న‌మైన వాద‌న‌ను కేటీఆర్ వినిపించ‌టం గ‌మ‌నార్హం.  ఏపీలో బాబు ఓట‌మిని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుతున్నార‌ని.. బాబును ఓడిస్తే జాబు బ‌స్తుంద‌ని అక్క‌డి యువ‌త భావిస్తున్న‌ట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముసుగు తీసి రావాలంటూ త‌మ‌ను ఉద్దేశించి బాబు గ‌మ్మ‌త్తుగా మాట్లాడుతున్నార‌న్న ఆయ‌న‌.. బాబును ఓడించ‌టానికి తాము ఏపీకి వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే లేద‌న్నారు.

అక్క‌డి ప్ర‌జ‌లే బాబును ఓడిస్తారంటూ వ్యాఖ్యానించారు. అవ‌స‌ర‌మైతే ఏపీకి వెళ‌తామంటూ కేసీఆర్ స్వ‌యంగా చెప్ప‌ట‌మే కాదు.. బ‌రాబ‌ర్ వెళ‌తామంటూ హ‌డావుడి చేసిన వైనానికి.. తాజాగా కేటీఆర్ టోన్ మార‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీ రాజ‌కీయాల్లో కేసీఆర్ జోక్యాన్ని ఏపీ ప్ర‌జ‌లు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని.. అలాంటిదేమైనా జ‌రిగితే బాబుకే లాభంగా మారుతుంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో గులాబీ ద‌ళం త‌మ ప్లాన్ ను మార్చుకున్న‌ట్లుగా భావిస్తున్నారు. ఇందులో బాగంగానే.. తాము ఏపీకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. వేలు పెట్ట‌కున్నా బాబును ఓడిస్తార‌న్న వ్యాఖ్య చేశార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News