సీరియస్ గా ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళలో.. చిలిపిగా మాట్లాడేస్తున్నారు తాజా మాజీ మంత్రి కేటీఆర్. మోడీ అంటే తమకు అస్సలు భయం లేదని.. అంతేనా.. మజ్లిస్ అధినేత అసద్ అన్నా తమకు ఎలాంటి బెరుకు లేదని చెప్పేశారు. ఒవైసీ.. మోడీలు తమకు ఎంతమాత్రం బాసులు కాదని చెప్పేశారు.
నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒకరు మతాలు.. మరొకరు ప్రాంతాల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ.. కాంగ్రెస్ లపై మండిపడటం ఒక ఎత్తుఅయితే.. హిందూ.. ముస్లిం.. సిక్కులు.. క్రైస్తవుల్ని ఒకేలా చూసిన ఘనత తమకు మాత్రమే సాధ్యమని చెప్పారు.
ఓకే.. కేటీఆర్ చెప్పిందంతా నిజమే అనుకుందాం. మోడీ.. ఒవైసీ అన్నోళ్లకు టీఆర్ ఎస్ భయపడదనే అనుకుందాం. మరి.. అంత భయమే లేనప్పుడు ఒవైసీని ఏ ఒక్క మాట అనటానికి నోరు రాదేం? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది. విపక్షాలు ఒకటి అంటే..తాము నాలుగు మాటలు అనకుండా ఉండలేని గులాబీ బ్యాచ్.. ఏ రోజు కూడా మజ్లిస్ నేతపై ఎలాంటి విమర్శలు ఎందుకు చేయరు? అన్నది ప్రశ్న.
ముస్లింలను ఓటుబ్యాంకుగా చూడటం తమకు రాదన్న మాటను చెబుతున్న కేటీఆర్.. అదే నిజమైతే.. పాతబస్తీ ఇప్పటికి అభివృద్ధి బాట ఎందుకు పట్టదు?అక‌్కడి ఇరుకు సందులు.. పేదరికంలో తల్లడిల్లే ప్రజలు ఎందుకు ఉన్నట్లు? పాత నగరానికి కొత్త సొగసులు అద్దే కార్యక్రమంతో పాటు.. ఓవైసీ బ్రదర్స్ మీద వచ్చే ఫిర్యాదుల్ని పోలీసులు ఎందుకు పరిష్కరించరు? అన్నది ప్రశ్న.
వీటి సంగతి పక్కన పెడితే.. మైకు చేతిలోకి వచ్చేస్తే.. అడ్డూ ఆపూ లేకుండా మాట్లాడే అక్బరుద్దీన్ లాంటి వారి తీరును ప్రశ్నించటం.. బాధ్యతారాహిత్యంతో వారు చేసే వ్యాఖ్యల్ని ఎందుకు ప్రశ్నించరన్నప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెబితే బాగుంటుంది. ఇవాల్టి రోజున బీజేపీని అంతో ఇంతో విమర్శలు చేసే కేటీఆర్.. ఒవైసీని మాత్రం మాట వరసకు కూడా ఏమీ అనని తీరు దేనికి నిదర్శనం. భయమే లేకుంటే.. బెరుకు లేని రీతిలో తప్పుల్ని ఎత్తి చూపించాలిగా. అలాంటి పని కేటీఆర్ ఎందుకు చేయరు? తమకు మోడీ.. ఒవైసీ అంటే భయం లేదన్న కేటీఆర్ మాటలు వింటే.. మరీ.. చిలిపిగా మాట్లాడతారేం కేటీఆర్ అన్న మాట మదిలో మెదలక మానదు. అవునా? కాదా?