ఖుషీ అవుతున్న కేటీఆర్‌

Update: 2019-02-01 13:33 GMT
రైతుబంధు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతుబంధు. వ్యవసాయం చేసుకునే రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే రైతుబంధు. ఈ పథకం అమలు చేసిన తీరు అన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ వైపు చూసేలా చేసింది. అంతేకాదు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధు పథకాన్ని అమలుచేసేలా పురిగొల్పింది. ఈ ఒక్క పధకంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తిరిగి అధికారంలోకి రావడమే కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్నారు.

అయితే తాజాగా ఆంధ్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుబంధు పథకాన్ని మరో రూపంలో ప్రవేశపెట్టిందని, ఇది అక్షరాలా తమ పథకమే నని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తాము రైతుబంధు పథకానికి ఎలాంటి ఆంక్షలు విధించలేదని, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆంక్షలతో కూడిన జైకిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని కేటీఆర్ తప్పుపట్టారు. తాము ప్రవేశపెట్టిన పథకాన్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం ఇది తమ సొంత పథకం గా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. తాము ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి ఒక సీజన్ కు నాలుగు వేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తున్నామని, కేంద్రం మాత్రం ఆంక్షలతో కూడిన జైకిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News