తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ చెప్పే మాటల్లో ఉండే తెలివిని చూస్తే ఎవరికైనా ముచ్చటేయక మానదు. గత కొద్దికాలంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఊసే పట్టించుకోని మంత్రి కేటీఆర్.. తాజాగా తెలుగుదేశం పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాము చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో అరకొరగా ఉన్న పార్టీపై విమర్శలు చేస్తే టైం వేస్ట్ తప్పించి మరొకటి ఉండదన్న విషయాన్ని గుర్తించి.. ఆ పార్టీని టార్గెట్ చేయటం మానేశారు.
అలాంటిది.. తాజాగా టీటీడీపీని విమర్శలు చేయటం షురూ చేశారు. ఏం చేసినా ప్రతి పనిలోనూ లెక్క ప్రకారమే చేసే కేసీఆర్ ఫ్యామిలీ.. తాజా విమర్శల సందర్భంగానూ తన అలవాటును వారు మర్చిపోలేదు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో టీటీడీపీపై విమర్శలు సంధించటం మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీ వినతి మీద పాలేరు బరి నుంచి తప్పుకున్న టీటీడీపీ.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తోంది.
దీంతో.. కాంగ్రెస్ తో పాటు టీటీడీపీని బద్నాం చేయటానికి తన మాటల అస్త్రాల్ని ప్రయోగించటం మొదలెట్టారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఈ రోజు అదే టీడీపీ నేతలు కాంగ్రెస్ తో జత కట్టటం శోచనీయంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు తీసుకున్న నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అసాధారణ పరిస్థితుల్లో ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో.. తమ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పుకున్నారు. కేటీఆర్ జోరు చూస్తుంటే.. పాలేరు ఉప ఎన్నిక ముగిసే నాటికి టీటీడీపీపై మరిన్ని ఘాటు విమర్శలు తప్పేటట్లు లేదు. మరి.. కేటీఆర్ వ్యాఖ్యలకు టీటీడీపీ తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో..?