మిగతా రాజకీయవేత్తలకు భిన్నంగా, ఇంకా చెప్పాలంటే తన తండ్రి లాగా ప్రత్యర్థులను అతి తక్కువ అంచనా వేసేందుకు అస్సలేమాత్రం ఇష్టపడకుండా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. అది కూడా అధికారం పీఠంపై కావడం గమనార్హం. కొద్దికాలం క్రితం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అనే పార్టీ ఉందా? వాల్లు అధికారంలోకి వస్తారా? అంటూ ఎకసెక్కాలు ఆడిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ కేటీఆర్ అందుకు పూర్తి భిన్నమైన కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావచ్చని వ్యాఖ్యానించారు.
ఫార్మాసిటీపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బీజేపీ నేతల కామెంట్లు తప్పని మండిపడ్డారు. రాజకీయాల్లో అన్నీ సాధ్యమే.. ఏమైనా జరుగొచ్చు.. రేపు మీరే అధికారంలోకి రావొచ్చు.. మేము ప్రతిపక్షంలో కూర్చొవచ్చు.. అని శాసనసభలో కిషన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. దీనికి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తాము గతంలో ఎప్పుడూ అధికారంలో లేమని, కేంద్రంలోనే అధికారంలో ఉన్నామని చెప్పారు. మంత్రి మాట్లాడుతూ గతంలో మీరు.. మీరు అంటూ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు తమ గురించి మాట్లాడితే బాగుంటుందని కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో అన్నీ సాధ్యం అవుతాయని, మీరు కూడా అధికారంలోకి వస్తారు అయితే అప్పటివరకు మాత్రం మన స్థానాలు ఇవే అంటూ మంత్రి చమత్కరించారు.
`ఇంకా ఏడాది సమయం ఉంది. అప్పటి వరకు మీరు (బీజేపీ) అక్కడే కూర్చుంటారు. మేము (టీఆర్ ఎస్) ఇక్కడే కూర్చుంటాం. ఆ తరువాత ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు. ఇద్దరు ఎంపీలున్న పార్టీ ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న పార్టీ.. రేపు ఎన్నికల తరువాత ఇద్దరు సభ్యులకే పరిమితం కావచ్చు. మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చారే తప్ప రాష్ట్రంలో అధికారంలో రాలేదు` అని మంత్రి కేటీఆర్ బీజేపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు రాష్ర్టానికి బయ్యారం ఉక్కు పరిశ్రమ - పన్ను ప్రోత్సాహకాలు - హైకోర్టు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు ఇలా చెప్పుకొంటూ పోతే చాలాఉన్నాయి అని చెప్పారు.