తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఉన్న బలం...తమ వాదన ఏదైనా....బలంగా ఔను అని ఎవరైనా భావించేలా వినిపించడం. సందర్భం ఏదైనా తాము చెప్పాలనుకున్నది పూర్తి పట్టుతో...ఎదుటివారు నమ్మేలా వినిపించడం గులాబీ దళపతి వారసులకు వెన్నతో పెట్టిన విద్య. అలా వాదన వినిపించిన సీఎం కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన విషయంపై ఆశ్చర్యకరమైన వాదన వినిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రిపై తరచుగా వినిపించే ఆరోపణ...ఆయనది కుటుంబం పాలన అని. ఆ నలుగురు తప్ప మరెవ్వరీకి ప్రాధాన్యం లేదని - అలా వచ్చే విమర్శలకు క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ తాము సైతం కాంగ్రెస్ పార్ములాను ఫాలో అవుతున్నట్లు చెప్పకనే చెప్పేశారు.
కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు - కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్ ఎస్ కే పట్టం కడుతున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటామన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా టీఆర్ ఎస్ ఘన విజయం సాధించిందన్నారు. నారాయణఖేడ్ - పాలేరు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ ఎస్ గెలిచిందంటే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. రాహుల్ గాంధీ వస్తే తాము భయపడుతమా..? అని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓడిపోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కుటుంబ పాలన విమర్వ గురించి ఎవరు అడగకుండానే..కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. ``కేటీఆర్ కుటుంబం ఉద్యమానికి పనికి వస్తుంది కానీ రాజకీయాలకు పనికి రాదా ? ..కాంగ్రెస్ నేతల కుటుంబాలే రాజకీయాల్లో ఉండాలా? తెలంగాణకు కేసీఆర్ కుటుంబం వల్ల ఏం అన్యాయం జరిగింది? `` అని ప్రశ్నించారు. తద్వారా వారసత్వ రాజకీయాల విషయంలో తాము కాంగ్రెస్ ఫార్ములాతోనే పోతున్నామని వెల్లడించారు.
కాగా, వంద సీట్లు గెలిచి సెంచరి కొడతాం ..కాంగ్రెస్ కంచుకోటలు బద్దలు కొడతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ రథసారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఆయన భార్య నియోజకవర్గాల్లో కూడా రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తనతో సహా ఎవరూ గెలిచినా అది కేసీఆర్ వల్లేనని పార్టీ విజయం క్రెడిట్ ను తన తండ్రికి దఖలుపరిచారు. కేసీఆరే మరోసారి సీఎం అవుతారని ప్రపంచమంతా చెబుతోందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.