పండితపుత్ర పరమశుంఠ అంటారు. కేసీఆర్ ఏదో లక్కు పనిచేసింది. అందుకే ఆయన విషయంలో ఈ సామెత పనిచేయలేదు. ఆయన పండితుడే. ఆయన కొడుకు మాత్రం తండ్రిమాటకారి తనాన్ని - స్పాంటెనిటీని వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మిగతా పార్టీలతో చాలా ముందున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే చాలా సభలు నిర్వహించింది. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ నేతలందరూ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. హరీష్ - కేటీఆర్ - కేసీఆర్ ముగ్గురు... ముగ్గురు ఎన్నికలయ్యే లోపు ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేయాలని ఫిక్సయినట్టు అర్థమవుతోంది. ఇటీవలే ఇబ్రహీం పట్నంలో హరీష్ రావు పర్యటించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్టణంలో కేటీఆర్ కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మహాకూటమిపై అనేక పంచ్ లు వేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
మహాకూటమి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని ఆయన ఆరోపించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులు ఆగం అవుతారన్నారు. కూటమిలో అందరూ సీఎం అభ్యర్థులేనని వ్యాఖ్యానించారు. మహాకూటమి ప్రభుత్వం వస్తే నెలకొక సీఎం మారుతారని అన్నారు. ఏ పదవి కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని కేటీఆర్ విమర్శించారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలా.. సింహం లాంటి సీఎం కావాలా? ప‌్రజలు తేల్చుకోవాలని సూచించారు. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు మనం స్వీట్లు పంచుకుంటామని పంచ్ వేశారు.
తెలంగాణలో టీడీపీకి క్యాడర్ లేదు. కాంగ్రెస్ కు లీడర్లు లేరు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో, ఐదేళ్ల టీఆర్ ఎస్ పాలన ఎలా ఉందో చూశారు కదా అని ప్రజలను హెచ్చరించారు.