మాంచి దూకుడు మీదున్న తెలంగాణ అధికారపక్షం గ్రేటర్ పీఠం మీద పెట్టుకున్న ఆశల విషయంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. గ్రేటర్ కోట మీద గులాబీ జెండా ఎగరాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ అధికారపక్షం.. ఇందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కేవలం రోజు వ్యవధిలో ఎన్నో తాయిలాల్ని ప్రకటించటంతో పాటు.. ఈ ఎన్నికల్లో కీలకభూమిక పోషించే అవకాశం ఉన్న ఆంధ్రులను దువ్వటం మొదలెట్టింది.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ ఎస్ నాయకత్వం ఒక పెద్ద లక్ష్యాన్నే పెట్టుకుంది. తెలంగాణ సాధన నేపథ్యంలో.. తాము అనుకున్న లక్ష్యం పూర్తి అయిన నేపథ్యంలో ఇంతకాలం సెటిలర్ల విషయాన్ని పెద్దగా పట్టించుకోని టీఆర్ ఎస్ వారి మనసుల్ని దోచుకోవాలని.. బలంగా ఉన్న వారి ఓటుబ్యాంకును చేజిక్కించుకోవటం ద్వారా మరింత బలమైన రాజకీయ శక్తిగా తెలంగాణలో అవతరించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా హైదరాబాద్ లో సెటిల్ అయిన ఆంధ్రుల్ని దువ్వటం మొదలెట్టింది. ఇప్పటివరకూ ఆంధ్రుల విషయంలో అనుకూలమైన వరాన్ని ఏ ఒక్కటి ప్రకటించకున్నప్పటికీ.. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ లోని ఆంధ్రులు తమ వెంటే ఉంటారని.. తమ ‘‘కారు’’లోనే ప్రయాణిస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. తాజాగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
తెలంగాణ వస్తే హైదరాబాద్ లోని ఆంధ్రులపై దాడులు జరుగుతాయన్న సందేహాలు వ్యక్తమయ్యాయని.. గడిచిన 18 నెలల్లో అలాంటి దాడులు జరిగిందే లేదని.. ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతికి ఆంధ్రులు తమ స్వస్థలాలకు వెళ్లి వచ్చిన తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలిసి ఉందామని పిలుపునిచ్చిన కేటీఆర్.. రాష్ట్ర విభజన జరిగినందువల్లే ఆంధ్రా ప్రాంతానికి కొత్త రాజధాని.. ఎయిమ్స్.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వచ్చాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంటే మినీ ఇండియా అని.. ఆంధ్రాతో పాటు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన పేదలైనా సరే.. వారందరి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రుల ఓట్లు తమవేనని.. రాష్ట్ర విభజన జరగకుండా ఆంధ్రా ప్రాంతానికి ఇన్నేసి ప్రాజెక్టులు.. ఇంత అభివృద్ధి వస్తుందా? అన్న ప్రశ్నలతో పాటు.. సంక్రాంతి పండక్కి వెళ్లి వచ్చిన తర్వాత హైదరాబాద్ లోని ఆంధ్రులు తమకే ఓట్లు వేస్తారన్న కేటీఆర్ ధీమా ఎంతవరకు నిజమన్నది తేలాలంటే గ్రేటర్ ఫలితాలు వెల్లడి అయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే.