తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరే.. ఆయన కుమారుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటలు చెప్పటంలో దిట్ట. ఆ మాటకు వస్తే.. మిగిలిన రాజకీయపార్టీలతో పోలిస్తే.. టీఆర్ ఎస్ పార్టీలో మాట్లాడే నాయకులు చాలామందే ఉన్నారు. మిగిలిన వారికి గులాబీ దళానికి మధ్య తేడా ఏమిటంటే.. వీరంతా ఉత్త మాటలే కాదు.. తమ మాటలకు ఒక విచిత్రమైన వాదనను వినిపిస్తారు.
ఈ వాదన ఎలా ఉంటుందంటే.. విన్నంటే నిజమే కదా అన్నట్లుగా ఉంటుంది. కానీ.. తరచి చూస్తే కానీ.. అసలు విషయం అర్థం కాదు. తాజాగా మంత్రి కేటీఆర్ మాటల్నే చూస్తే.. గత కొన్ని నెలలుగా పెద్దగా మాట్లాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీఆర్ ఎస్ సర్కారును విమర్శించటం మొదలు పెట్టినంతనే.. ఆయనకో విచిత్రమైన సవాలు విసిరారు.
బీహార్ కు రూ.1.65లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారని.. మరి.. కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి తెలంగాణకు రూ.లక్ష కోట్లు (రూ.65 వేల కోట్లు డిస్కౌంట్ ఇచ్చారే?) ప్యాకేజీ తీసుకురాగలరా? అని సవాలు విసిరారు. తెలంగాణ కొత్త రాష్ట్రమని.. ఎన్నో సమస్యలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రానికి వెళ్లి ప్యాకేజీ కోసం పట్టుబట్టాలని సూచించారు.
గతంలో తెలంగాణ సాధన సమయంలోనూ టీఆర్ ఎస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని ఇలానే మోపు చేసి.. తెలంగాణ వారి చేత తెప్పించుకుని అధికారం హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు లక్ష కోట్ల ప్యాకేజీ అంటూ కిషన్ రెడ్డికి కొత్త టార్గెట్ పెడుతున్నారు. ఒక పార్టీ వారు తెలంగాణ తీసుకొస్తే.. మరో పార్టీ వారు రూ.లక్ష కోట్లు ప్యాకేజీ తీసుకొస్తే.. అధికారం చేతిలో పెట్టుకొని వీరు చెలాయిస్తారన్న మాట.
విపక్షాలు చెప్పే మాటల్ని వినేందుకు సైతం టైమివ్వకుండా.. అపాయింట్ మెంట్ దండగ అనే ముఖ్యమంత్రికి చెందిన పార్టీ వారు.. విపక్షాలు మాత్రం భారీ ప్యాకేజీలు తీసుకురావాలని చెప్పటం కేటీఆర్ అండ్ కోకు మాత్రమే చెల్లుతుందేమో. సొమ్ము ఒకరిది.. షోకు మరొకరదన్నట్లుగా కేటీఆర్ వ్యవహారం లేదూ..?