తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ ఎస్ బంపర్ మోజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే. తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా డబ్బు - మద్యం ఎక్కువగా పట్టుబడింది తెలంగాణలోనే. వందల కోట్ల రూపాయాలు ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకోగా అనధికారికంగా వేల కోట్లు చేతులు మారినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు సమర్పించిన ఖర్చు వివరాలు చూస్తే మాత్రం నమ్మశక్యంగా కనిపించడం లేదు.
డూ ఆర్ డై.. గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో డబ్బుల కట్టలు విచ్చలవిడిగా నాట్యమాడాయి... మద్యం ఏరులై పారిన సంగతి తెలిసిందే.. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చులు చేసిన వివరాలకు - ఎన్నికల కమిషన్ కు సమర్పించిన వివరాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ఎన్నికల కమిషన్ ఈసారి ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి 28లక్షల వరకు ప్రచారానికి ఖర్చు పెట్టుకునే అవకాశం కల్పించింది. అయితే సదరు అభ్యర్థులు ఎన్నికల కమిషన్ పెట్టిన టార్గెట్ సగానికి కూడా చేరుకోలేదని వారు తాజాగా సమర్పించిన అఫిడవిట్ చూస్తే అర్థమవుతోంది. అదే సమయంలో ఆశ్చర్యం కలుగుతోంది..
కేసీఆర్ తనయుడు - మాజీ మంత్రి కేటీఆర్ ఈసారి పాత కరీంనగర్ జిల్లా సిరిసిల్లా నియోజకవర్గం స్థానం నుంచి పోటీచేశారు. పోటాపోటీగా ప్రచారం చేశారు.. ఇక్కడ ఓటుకు 2 నుంచి 5వేల వరకు పంచారని ఆరోపణలు వచ్చాయి. డబ్బులు కట్టలు ఓటర్లకు చేరిన సంగతి జగమెరిగన సత్యం. అలాంటి ఈ స్థానం నుంచి గెలిచిన కేటీఆర్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన ఖర్చు చూస్తే ముక్కన వేలేసుకోవాల్సిందే. కేటీఆర్ సిరిసిల్ల ప్రచారం కోసం అయిన ఖర్చు కేవలం 14.83లక్షలేనట. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - బీజేపీ అభ్యర్థులు కుల సంఘాలు - మహిళా సంఘాలతో గంపగుత్తగా బేరాలు సాగించారు. ఎవరు ఎక్కువ డబ్బులు చెల్లిస్తే వారికే మద్దతు ఆయా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
అలాగే కార్యకర్తలకు ప్రతిరోజూ బీరు - బిర్యానీ - మద్యం - హంగామా ఖర్చులు వైగారా వంటివి ఇంక చెప్పనక్కర్లేదు. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో కూడా అభ్యర్థులు ఎన్నికల కమిషన్ విధించిన టార్గెట్ కూడా పూర్తి చేయకుండానే ప్రచారం ముగించారంటే నమ్మశక్యం కావడం లేదు.
అదేవిధంగా సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి 15లక్షల పైగా - కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రూ.7లక్షల 51వేల 657 రూపాయాలు ఎన్నికల కమిషన్ కు ఖర్చు చూపించారు. కాంగ్రెస్ కు పార్టీ ఫండ్ 20లక్షలు వచ్చినా ఆయన కేవలం 7లక్షలు మాత్రమే ఖర్చు చేశారట. అలాగే కేటీఆర్ రూ.14.83లక్షలు ఖర్చు చేయగా.. కొందరు చందాలుగా కేటీఆర్ కు 10లక్షలు ఇచ్చినట్లు చూపించారు. ఈ ఎన్నికల ఖర్చును చూస్తుంటే నేతలు వాగ్దానాలతో ఓటర్లను బురిడి కొట్టించడమే కాదు.. లెక్కలతో ఎన్నికల కమిషన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్టు అర్థమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇదంతా చూసిన జనం ఎన్నికల్లో ఇదంతా కామన్ అని లైట్ తీసుకుంటున్నారు..