తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ పెరిగిపోయింది. హోరాహోరీగా తలపడేందుకు పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరు ప్రధానంగా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ మధ్యనే సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు పార్టీలు సోషల్ మీడియాను ఇబ్బడిముబ్బడిగా వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ కు మొదటి నుంచి సామాజిక మాధ్యమాన్ని వాడుకోవడం బాగా తెలుసు. అయన ట్విట్టర్ తో పాటు ఇతర మాధ్యమాల్లో నిత్యం టచ్ లో ఉంటాడు.
ఇటీవల కేటీఆర్ పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీఆర్ ఎస్ అభిమానులు ఉత్తమ్ ఆరోపణలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. 'కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు అంట్లు తోముకునేవారు' అని ఉత్తమ్ సంచలన కామెంట్లు చేశారు. దీంతో కేటీఆర్ అభిమానులు ఉత్తమ్ దిమ్మదిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు. వినూత్న నిరసన చేపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారంతా అంట్లు తోముతూ ఉన్న ఫోటోలను ఉత్తమ్ కు షేర్ చేసి ఛాలెంజ్ విసురుతున్నారు. 'డిష్ వాష్' ఛాలెంజ్ కు కాంగ్రెస్ నాయకులు సిద్ధమా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గతంలో కాంగ్రెస్ నాయకుడు జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చేసిన వ్యాఖ్యలు షోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కేటీఆర్ అభిమానుల చేస్తున్న డిష్ వాష్ ఫోటోలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో కేటీఆర్ కు సోషల్ మీడియాలో ఉన్న బలమెంతో తెలుస్తోంది. అయితే దీనిని ఎన్నికల ప్రచారంలో కూడా వాడుకొని కేటీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి స్కెచ్ గీస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.