కూర్చొని సీట్లు పంచుకోలేరు..ప్రభుత్వాన్ని నడుపుతారా?’

Update: 2018-11-11 08:31 GMT
రైతు ఆశీర్వాద సభలో కేటీఆర్ రెచ్చిపోయారు. చంద్రబాబు - సోనియా - రాహుల్ - కోదండరాం లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ది భస్మాసుర హస్తమని.. కలిసి కూర్చొని సీట్లు పంచుకునే తెలివి లేదు.. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేది అంటూ మండిపడ్డారు. తెలంగాణాను భ్రస్టు పట్టించడానికి వస్తున్న వీరిని ఓటుతో సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

గూట్లో రాయి తీయనోళ్లు.. ఏట్లో రాయి తీస్తరట.. అని మహా కూటమిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రాహుల్ సిట్లిస్తే.. చంద్రబాబు నోట్లిస్తున్నడు.. రాహుల్ సీట్లకు - చంద్రబాబు నోట్లకు.. తెలంగాణ ప్రజలు ఓట్లతో సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబుకు - అధికారం చేతికిస్తే ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయా అని ప్రశ్నించారు.

పాపం కోదండరాం సార్ ను అందరూ కలిసి ఇరికించిడ్రు.. ఆయన అమాయకుడు అని కేటీఆర్ అన్నారు. ఆయన చూస్తే బాధేస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో ఇటాలియన్ మాఫియా అని - దేశానికి పట్టిన శని అని తిట్టిన చంద్రబాబు.. సిగ్గు లేకుండా ఇప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని అన్నారు. రైతులను రాజును చేయాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని - గతంలో అర్థరాత్రుల్లో కరెంటు కోసం కావలి కాసే పరిస్థితి ఉండేదని - విత్తనాలు - ఎరువులు - పురుగు మందుల కోసం బారులు తేరే వారని - ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు.

మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గతంలో రైతుల దగ్గరకు వెళ్లేందుకు భయమేసేదని.. ఇప్పుడు తలెత్తుకుని మాట్లాడుతున్నామని.. ప్రభుత్వానికి మొట్టమొదటి సారిగా పెట్టుకున్న ఆశీర్వాద సభ అని అన్నారు. వందకు పైగా సీట్లలో టీడీపీ - కాంగ్రెస్ లకు డిపాజిట్ లేకుండా చేయాలని అని కోరారు.


Tags:    

Similar News