సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ ఎంత చురుగ్గా ఉంటారో తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ లో చాలామందికి ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా అందుబాటులోకి రావటమే కాదు.. పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. రాష్ట్రంలోని మరే మంత్రి చేయని రీతిలో కేటీఆర్ సహాయ సహకారాలు అందించటమేకాదు.. సామాన్యులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటున్నారు. అయితే.. ఇలాంటి సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్న తీరు చూస్తే ఆగ్రహం కలుగక మానదు.
మొన్నటికి మొన్న తాను ఫుడ్ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే.. లెగ్ పీస్ లేకుండా చికెన్ బిర్యానీ వచ్చిందంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయటం.. నా నుంచి ఏం కోరుకుంటున్నావంటూ కేటీఆర్ స్పందించటం తెలిసిందే. నిజానికి ఫుడ్ యాప్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగా రాకుంటే..దాని ఫోటోను పోస్టు చేసి.. కంప్లైంట్ ఇస్తే చెల్లించిన డబ్బుల్ని వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు. అలాంటి అవకాశం ఉన్నప్పటికీ మంత్రి కేటీఆర్ ట్విటర్ ఖాతాలో కంప్లైంట్ చేయటం అర్థం లేనిది.
తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది. అహ్మద్ ఖాన్ అనే నెటిజన్ తనకు ఉస్మానియా సిబ్బంది ఫ్యాక్టర్ 8ఇంజక్షన్ ఒకసారి మాత్రమే ఇచ్చారని.. మరో ఇంజక్షన్ కు మరో మూడు రోజులు సమయం పడుతుందని చెబుతున్నారంటూ కంప్లైంట్ చేశారు. సదరు నెటిజన్ ట్వీట్ కు కేటీఆర్ స్పందించి.. అసలు విషయాన్నివెల్లడించారు. కేటీఆర్ చెప్పింది వింటే అవాక్కు అవ్వాల్సిందే. సదరు ఫ్యాక్టర్ 8 ఇంజక్షన్ విలువ రూ.14లక్షలని.. దాన్ని ఉచితంగా ఇస్తున్నారని.. మరో ఇంజక్షన్ ను గడువు మేరకు ఇస్తారని.. వైద్య సిబ్బంది మీద అభాండాలువేయొద్దని.. వారిపై ఒత్తిడి తేవొద్దంటూ సున్నితంగా క్లాస్ పీకిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సాయం పొందుతూ కూడా ఫిర్యాదు చేయటం సరికాదన్న భావన పలువురి నుంచి వ్యక్తమవుతోంది.