టీఆర్ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు. వీటిలో రాజకీయాలు మాత్రమే కాదు.. సినిమాలు.. ఇతర అంశాలు కూడా ఉంటాయి. రీసెంట్ గా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు. అందులో ఇద్దరు యువకులు ఫెన్సుకు అవతల నుంచి తెలివితక్కువగా ఎలా తమ స్మార్ట్ ఫోన్ ను తీసుకునేందుకు ప్రయత్నించారు అన్నది ఉంది.
చాలామంది ఈ వీడియో ఫన్నీగా ఉందని అన్నారు కానీ కొంతమంది నెటిజనులు మాత్రం కేటీఆర్ ను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఒకరు రైతుల ఆత్మహత్యలపై ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే.. మరొకరు రియల్ ఎస్టేట్ స్కామ్ పై చర్యలు తీసుకోకుండా ఈ వీడియోలు ఏంటి అని అడిగారు. మరి కొందరు 'దొరవారికి ఈ ఫన్నీ వీడియోలు చూసే తీరిక ఉంది కానీ సమస్యలు తీర్చే సమయం లేదు' అంటూ కామెంట్ చేశారు.
ఈ విమర్శలకు డైరెక్ట్ గా కేటీఆర్ స్పందించలేదు గానీ ఇన్ డైరెక్ట్ గా మాత్రం అదిరిపోయే పంచ్ ఇచ్చారు. మూడు నాలుగు ట్వీట్లు చేసి తను ఆ రోజు చేసిన మంచి పనులు వెల్లడించారు. సిర్సిల్లలో పేద కుటుంబాలకు 3,058 హౌస్ పట్టా సర్టిఫికేట్లు అందజేశామని.. ఇది వారి నాలుగు దశాబ్దాల కల అని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు అంజ గౌడ్ కుటుంబానికి రైతు భీమా పథకం కింద రూ. 5 లక్షల చెక్ అందించమని తెలిపారు. 7502 రైతు కుటుంబాలకు ఇప్పటివరకూ 375 కోట్ల రూపాయలను అందించామని తెలిపారు. ఇవి కాకుండా మరో ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్ ఖర్చు అవసరమై కేటీఆర్ ను సంప్రదిస్తే తన వైపు నుండి సహయం చేస్తానని ఆఫీసులో సంప్రదించమని జవాబిచ్చారు.