సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ సమస్యలపై స్పందించడంలోనే కాదు.. తనదైన శైలిలో నెటిజన్లకు ఆహ్లాదాన్ని పంచడంలోనూ ముందుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పని ఒత్తిడి.. ఇతర కారణాలతో ఎవరికైనా చూపు మందగించడం ఖాయం. ఇక కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి అయితే తొందరగానే కళ్లు పాడై పోతాయి. ఇప్పుడు ప్రజాజీవితంలో బిజీగా ఉండే కేటీఆర్ కు కూడా కళ్లు కనిపించడం లేదట.. చూపు మందగించిందట..
ఇప్పటివరకూ కళ్ల అద్దాలు పెట్టుకోకుండా మేనేజ్ చేసిన కేటీఆర్ కు ఇప్పుడు కంప్యూటర్ పై అక్షరాలను చదవడం కష్టమైపోతోందట.. అందుకే ఇక తప్పని సరి పరిస్థితుల్లో కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘తాను కళ్లద్దాలు పెట్టుకున్న చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసిన కేటీఆర్ ఈ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘కళ్లద్దాలు లేకుండా చదవలేకపోతున్నాను అంటే కొంతసేపు నమ్మబుద్ది కావడం లేదు. అధికారికంగా నాకు వయసు మీద పడుతోంది’ అంటూ తన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.
ఇక ముసలోడిని అయిపోయాను అంటూ కేటీఆరే తనను తాను అనడంతో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘మీరు ముసలోడు అవ్వలేరు సార్’ అంటూ ధైర్యం చెబుతున్నారు. ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.
కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు చాలా పెద్ద పెద్ద చదువులే చదివారు. అమెరికాలో చదివి అక్కడే సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేశారు. ఎంబీఏ మార్కెటింగ్ జాబ్ కూడా చేసినట్టు గుర్తు . అనంతరం కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలోకి దిగారు. ఇన్నాళ్లకు ఆయన కళ్లద్దాలు అవసరమయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.