వీళ్లను గుర్తుపట్టారా? ఇప్పుడూ.. ఎప్పుడూ.. టీఆర్ ఎస్ కు జోడెద్దులు..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకపాత్రలు పోషిస్తున్న యువ నేతలు ఎవరంటే రాష్ట్రమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు. వీళ్లిద్దరూ సీఎం కేసీఆర్‌కు రక్త సంబంధికులే.. ఒకరు కుమారుడైతే.. మరొకనేత మేనల్లుడు. అయితే ఈ యువనేతలకు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ యువ నేతలకు చెందిన ఓ పాత ఫొటో ఇప్పుడు మధుర జ్ఞాపకంగా మారింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు .. కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీ ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా హరీశ్‌రావే కాపాడుతూ ఉంటారు. అందుకే ఆయనను టీఆర్ఎస్ పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పిలుస్తుంటారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో మినహా.. హరీశ్ ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్నారంటే.. ఆ నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని విజయం సాధించడం ఖాయం.
ఉద్యమ సమయంలోనూ.. తెలంగాణ తొలిసారిగా అధికారంలో వచ్చాక కూడా హరీశ్‌రావు పార్టీలో కీలకపాత్ర పోషించారు.
అయితే 2019 ఎన్నికల అనంతరం హరీశ్‌రావుకు టీఆర్ఎస్ పార్టీలో క్రమంగా ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందని వార్తలు వినిపించాయి. అందుకు కారణం కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పడిన క్యాబినెట్లో హరీశ్‌రావుకు చోటు దక్కలేదు. దీంతో విమర్శలు వచ్చాయి. అయితే తొలి మంత్రివర్గ విస్తరణలో హరీశ్‌కు ఆర్థికశాఖ దక్కింది. ఆ తర్వాత ఆయన మళ్లీ పార్టీలో కీ రోల్ పోషిస్తున్నారు. ఇక అమెరికాలో చదువుకొని.. అక్కడే స్థిరపడ్డ కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి కొంత ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తన దైన శైలిలో దూసుకుపోయారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని కీలకనేతగా ఎదిగారు. అయితే ఆయన ఉద్యమనేతకంటే ఐటీ మంత్రిగానే మంచి పేరు తెచ్చుకున్నారు.
హైదరాబాద్‌కు వివిధ కంపెనీలు తీసుకురావడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే త్వరలోనే ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ ఒత్తిడివల్లే సీఎం కేసీఆర్ హరీశ్‌రావును పక్కనపెడుతున్నారని.. హరీశ్‌రావుకు రాష్ట్రంలో మాస్ లీడర్‌గా ఎంతో చరిష్మా ఉన్నప్పటికీ.. ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు రావడం లేదన్నా వాదన ఉంది. అయితే ఇందుకు మంత్రి కేటీఆర్ కారణమని పొలిటికల్ సర్కిళ్లలో టాక్. ఏది ఏమైనప్పటికీ.. ఈ ఇద్దరు నేతలు ఒక్క టీఆర్ఎస్ పార్టీలోనే కాక.. మొత్తం తెలంగాణ రాజకీయాల్లోనే కీలకనేతలుగా ఎదిగారు. ఇప్పుడు వీరి చిన్ననాటి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.