కొడుకు బిగి కౌగిలిలో కేటీఆర్ తన్మయత్వం

Update: 2019-04-13 08:24 GMT
బయటకు కనిపించేది చూసి ఒకరు ఇలాంటి వారు అని డిసైడ్ కావటం.. పుస్తకం కవర్ పేజీ చూసి.. పుస్తకంలో ఎలాంటిదో డిసైడ్ చేసినంత తప్పుగా చెప్పక తప్పదు. మనిషిలో పైకి కనిపించే దానికి.. అంతర్లీనంగా ఆ వ్యక్తిలో ఉండే భావాలకు అస్సలు సంబంధం ఉండనట్లుగా ఉంటుంది. ఎవరిదాకానో ఎందుకు?  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయాన్నే చూడండి.

రాజకీయాల్లో ఆయన ఎంత టఫ్ గా ఉంటారో.. ప్రత్యర్థుల విషయంలో ఆయన వ్యవహరించే ధోరణి ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఎక్కడా దొరక్కుండా.. అస్సలు చిక్కకుండా ఉండే ఆయనలో కరకు రాజకీయ నేతగా కనిపిస్తారు. మరి.. ఇంత టఫ్ గా ఉంటే కేటీఆర్ లో మరొకరు ఉన్నారు. ఆయనలోని తండ్రి కోణం.. ఫ్యామిలీ పర్సన్ కోణం పలువురి దృష్టిని ఆకర్షిస్తుంటుంది.

సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే కేటీఆర్..హాట్ హాట్ పొలిటికల్ వ్యాఖ్యలతో పాటు.. కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని షేర్ చేస్తుంటారు. తాజాగా అదే తరహాలో ఆయన పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా విపరీతమైన బిజీలో ఉంటూ వచ్చిన ఆయన గురువారం జరిగిన పోలింగ్ తో ఎన్నికల మారథాన్ కు బ్రేక్ పడినట్లైంది.

పాలిటిక్స్ కు బ్రేక్ ఇచ్చిన ఆయన.. కుటుంబంలో రిలాక్స్ అయ్యారు. ఈ సందర్భంగా తన పదమూడేళ్ల కొడుకుతో ఆయన దిగిన ఫోటో ఆసక్తికరంగా మారింది. పదమూడేళ్ల వయసుకే కొడుకు తండ్రి కంటే పొడుగ్గా ఉంటే.. ఇలానే ఉంటుందన్న అర్థం వచ్చేలా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

రాజకీయాలే కాదు.. కేటీఆర్ లో ఫ్యామిలీ పర్సన్ యాంగిల్ ముచ్చటగా ఉండకమానదు. ఇక.. కేటీఆర్ కుమారుడు హిమాన్షు విషయానికి వస్తే.. పదమూడేళ్ల వయసుకే తండ్రి కంటే హైట్.. అదే సమయంలో వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ మధ్యన పలు పబ్లిక్ ఫంక్షన్లలో తళుక్కున మెరిసిన ఆయన.. ఇటీవల బయట ఎక్కువగా కనిపించటం లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. కొడుకు బిగి కౌగిలిలో తన్మయత్వంలో చిక్కుకుపోయిన కేటీఆర్ ఫోటో చూసినప్పుడు.. మారిన ఈ తరం నాన్న కనిపిస్తారు.
    

Tags:    

Similar News