తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ కాగా.. రెండోది వరంగల్ - నల్గొండ - ఖమ్మం నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచి సత్తా చాటాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. గులాబీ పార్టీని ఓడించడం ద్వారా తమ బలం నిరూపించుకోవాలని విపక్షాలు ఆరాటపడుతున్నాయి.
ఈ ఎన్నికల్లో మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన హైదరాబాద్ లోని షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందుగానే కేంద్రానికి చేరుకున్న మంత్రి.. లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ పోలింగ్ సాయంత్రం 4 గంగల వరకు కొనసాగనుంది. రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10 లక్షలా 36 వేల 833 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండు స్థానాల్లో కలిపి 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడం విశేషం. మొత్తం 1835 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ దెబ్బతో.. యువత, నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులు టీఆర్ఎస్ ను ఎంత మేర విశ్వసిస్తున్నారో తేలిపోనుంది.