ప్రత్యేకమైన ఎజెండా ఏమీ లేదు. విషయం చాలా క్లియర్. తమకు రాజకీయంగా మేలు చేసే వారి మాటల్ని ప్రస్తావిస్తూ తమ ఇమేజ్ నుపెంచుకునేలా మాట్లాడటం.. తమకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారే వారి మాటల పై విరుచుకుపడే విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రూటు కాస్త సపరేటుగా చెప్పాలి.
ఎదుటి వారి స్థాయి ఏమిటి? వారి పరపతి ఎంత? అన్నది పట్టించుకోకుండా.. తమకు చేటు కలిగించే వారిని బండకేసి బాదేసినట్లుగామాటలు అనేసే ధోరణి కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏదో మాట్లాడానంటే మాట్లాడాన్నట్లు కాకుండా తన మాటల కు లాజిక్ ను చేర్చటం ద్వారా తనవి ఉత్త మాటలు కావన్న ఫీల్ కలిగేలా చేస్తుంటారు కేటీఆర్.
తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా వాద్రా ను ఉద్దేశించి ఘాటుగా రియాక్టు అయ్యారు మంత్రి కేటీఆర్. ఆమెను ఉద్దేవించి చేసిన రాజకీయ వ్యాఖ్యలు కలకలంగా మారాయి.
ఆమెను అప్పుడప్పుడు వచ్చే టూరిస్టుగా అభివర్ణించిన ఆయన.. దారిన పోయే దానయ్యలన్న మాట అనేందుకు వెనుకాడలేదు. అదేసమయంలో తమ గురించి తమ పాలన గురించి గొప్పలు చెప్పే మంత్రి కేటీఆర్ మాటలు ఆసక్తికరంగా మారాయి.తాజాగా హైదరాబాద్ లోని ఒక కార్యక్రమంలో హాజరైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగామారాయి. కేటీఆర్ మాట ఎంత పదునుగా ఉంటుందన్న దానికి నిదర్శనంగా ఆయన మాటల్ని చూడొచ్చు.
- దారినపోయే దానయ్యలు, అప్పుడప్పుడు వచ్చే టూరిస్టులు కొట్టే డైలాగుల కు ప్రజలు మోసపోవద్దు. సీఎం కేసీఆర్ అనుక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టేలా మమ్మల్ని నడిపిస్తున్నారు.
- కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యేలా మూడోసారి గెలిపించాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యం. హైదరాబాద్‌లో వరదలు వస్తే.. పెద్ద పెద్ద నోళ్లు వేసుకొని మాట్లాడే బీజేపీ నేతలు కేంద్రం నుంచి పైసా తెచ్చిండ్రా?
- తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? రాజకీయ సుస్థిరత, కేసీఆర్ నాయకత్వ పటిమ వల్లే తెలంగాణ కు ఐటీ, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి.
- తొమ్మిదేళ్లలో హైదరాబాద్ మహానగరం అందరూ గర్వపడే విధంగా బాగుపడింది. నగరంలోని కొన్ని ప్రాంతాలకు వెళితే.. మన దేశంలో ఉన్నామా? న్యూయార్క్ నగరంలోనా? అనే సందేహం కలిగేంత స్థాయిలో హైదరాబాద్ మారిందని సినీనటుడు రజనీకాంత్ చెప్పారు. అమెరికాలో ఉంటూ ఇటీవల నగరానికి వచ్చిన సినీనటి లయ కూడా.. హైదరాబాద్ లాస్ ఏంజెలిస్, న్యూయార్క్ లా మారిందన్నారు.
- హైదరాబాద్ అంతా మారిందని, భూతల స్వర్గమైందని చెప్పడంలేదు. కొన్ని సమస్యలున్నాయి. ఇంకా ఉంటాయి.