ఈ రెండు ఫోటోలు చాలు.. మన బతుకులు ఎలా ఉన్నాయో చెప్పేస్తాయ్

Update: 2020-08-03 10:10 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి నిలువెత్తు రూపంగా కనిపిస్తుంటుంది ప్రగతిభవన్. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతో పాటు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కుటుంబం.. వీరు కాకుండా ఎక్కువగా అక్కడే ఉండే రాజ్యసభ సభ్యుడు సంతోష్.. తరచూ వచ్చి వెళ్లే మాజీ ఎంపీ కవితతో సందడి సందడిగా ఉంటుంది. ఇక.. రాఖీ.. బోనాలు.. బతుకమ్మ.. లాంటి వేళలో సంబరాలు మరింత భారీగా సాగుతుంటాయి.

తాజాగా రాఖీ పండుగ వేళ.. కేటీఆర్.. సంతోష్ లకు కవిత రాఖీలు కడితే.. మరికొందరు మహిళా నేతలు సైతం ప్రగతిభవన్ కు వచ్చి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని ప్రదర్శించారు. పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఇంత హడావుడిలోనూ ప్రస్తుతం తరుముతున్న కరోనా భయానికి ముఖానికి మాస్కులు వేసుకున్నవైనం చూస్తే.. కరోనాతో ఎలాంటి బతుకులు ఎలా మారిపోయాయన్న భావన కలగటం ఖాయం.

మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు లోనూ సందడి కనిపించింది. ఆయన ఇంటికి కూడా పలువురు మహిళానేతలు తరలి వచ్చారు. ఆయనకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. అన్ని చోట్ల.. ముఖానికి మాస్కులు కట్టుకొని రాఖీ పండుగను జరుపుకున్న తీరు చూస్తే.. ఎలాంటి రోజులు పోయి ఎలాంటి రోజులు వచ్చాయన్న భావన కలగటం ఖాయం. ఇక.. ప్రగతిభవన్ లోని రాఖీ సందడికి.. సిద్దిపేటలోని జరిగిన సందడికి మధ్య తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.
Tags:    

Similar News