కేటీఆర్ ఫుల్ ఖుషీ వెన‌క సీక్రెట్ ఇదే

Update: 2016-06-27 11:36 GMT
అడిగిన‌వ‌న్నీ ఇచ్చేస్తే ఎవ‌రికైనా ఆనంద‌మే. ఇప్ప‌డు తెలంగాణ ఐటీ - మునిసిప‌ల్ శాఖ మంత్రి - సీఎం త‌న‌యుడు కేటీఆర్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌కు కేంద్రంలో అన్నీ సానుకూల ప‌వ‌నాలే వీస్తున్నాయ‌ట‌. దీంతో ఆయ‌న తెగ సంబ‌ర ప‌డిపోతున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ - తెలంగాణ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ప‌న్ను ప్రోత్సాహ‌కాల‌ను ప్ర‌క‌టించింది. రెండేళ్లు గడిచినా అవి అమ‌ల్లోకి రాక‌పోవ‌డంతో దీనిపై మాట్టాడేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు.

   ఈ సంద‌ర్భంగా ఆయ‌న  కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ తో భేటీ అయి.. వ‌చ్చిన ప‌ని గురించి వివ‌రించారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించ‌డంతో పాటు.. ఆ విష‌యం త‌మ ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు. ఇంకేముంది తానొచ్చిన ప‌ని సానుకూల‌మ‌వుతుండ‌డంతో కేటీఆర్ ఆనందంలో మునిగిపోయార‌ట‌.

 నిర్మ‌లా సీతారామ‌న్‌ ను క‌లిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్టాడుతూ.. ఇరు రాష్ట్రాల‌కు గ‌తంలో కేంద్రం ప‌న్ను రాయితీలు - ఆర్థిక ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించింద‌ని - వాటిని అమ‌లు చేయాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. ఈ అంశం త‌మ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని కేంద్ర‌మంత్రి చెప్పార‌ని ఆయ‌న అన్నారు. బ‌హుళ ఉత్ప‌త్తుల సెజ్‌ లు 2 మంజూరు చేయాల‌ని తాము కేంద్రాన్ని కోరిన‌ట్లు ఆయ‌న తెలిపారు. పూర్తి స్థాయి ప్ర‌తిపాద‌న‌తో ర‌మ్మ‌ని కేంద్ర మంత్రి సూచించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

హైద‌రాబాద్‌ ను మ‌రింత తీర్చిదిద్ద‌డానికి నిధులు కోరిన‌ట్లు చెప్పారు. చాలా విష‌యాల్లో నిర్మలా సీతారామ‌న్‌ సానుకూలంగా స్పందించార‌ని ఆయ‌న‌ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  జూలై 11న హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 25 లక్షల మొక్కల నాటే కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించనున్నారు. కాగా, కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఇంకా కొన‌సాగుతోంది.
Tags:    

Similar News