మొట్టమొదటిసారిగా వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ తొలి బోణి కొట్టారు. ఎయిర్ ఏసియా - నోవార్టిస్ - మిత్సుబిషి - హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్ పీ) - హిటాచీ - ఫవద్ అల్గానిమ్ కంపెనీ - ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ దుబాయ్ తదితర ప్రముఖ కంపెనీల ప్రముఖులతో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా దావోస్ లో మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా - సీఈవో సీపీ గుర్నానితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వరంగల్ లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా కేటీఆర్ కు తెలిపారు. టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆనంద్ మహీంద్రాకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్ బోణి కొట్టినట్లయింది.
మరోవైపు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మార్కెటింగ్ చీఫ్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఫిలిప్స్ మార్కెటింగ్ చీఫ్ హెంక్ డీ జాంగ్ కాసేపు మంత్రితో ముచ్చటించారు. మెడికల్ డివైస్ లు - ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి కోసం తెలంగాణలో ఉన్న లాభదాయకమైన పరిస్థితుల కోసం మంత్రి కేటీఆర్.. ఫిలిప్స్ సంస్థకు వివరించారు. మంత్రి కేటీఆర్ ఇవాళ ట్రినా సోలార్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రోంగ్ ఫాంగ్ తోనూ భేటీ అయ్యారు. సౌర విద్యుత్తు కోసం ఫలకాలు తయారు చేసే అతి పెద్ద సంస్థగా రోంగ్ ఫాంగ్ కు గుర్తింపు ఉన్నది. తెలంగాణలో ఇప్పుడు క్లీన్ ఎనర్జీ యుగం నడుస్తున్నదని, సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తి కోసం తెలంగాణ అనువైన ప్రదేశమని మంత్రి కేటీఆర్ ట్రినా సోలార్ సంస్థకు తెలియజేశారు.
బల్గేరియాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి నికోలినా అంగ్లికోవాతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టూరిజం అంశంపై ముచ్చటించారు. స్టార్టప్ లతో తమ మధ్య బంధాన్ని బలోపేతం చేయాలని భావించారు. పర్యాటకంలోనూ ఇద్దరి మధ్య పరస్పర సహకారం ఉండాలని నేతలు నిర్ణయించారు. వెల్ స్పన్ గ్రూపు సంస్థ చైర్మన్ బీకే గోయెంకతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ఆర్థిక సదస్సు సందర్భంగా దావోస్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో ఈ సమావేశం జరిగింది.