యోగీకి షాక్...కేటీఆర్ కొత్త లెక్కలు

Update: 2018-03-15 05:31 GMT
ఢిల్లీకి దగ్గ‌రి దారి అనే పేరొందిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో అనూహ్య రాజ‌కీయ ఫ‌లితం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఉత్తరాదిన కీలకమైన రెండు పెద్ద రాష్ర్టాలు ఉత్తర్‌ ప్రదేశ్ - బీహార్‌ లలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయం పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ రాష్ర్టాల్లో మూడు లోక్‌ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురైంది. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ - ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన గోరఖ్‌ పూర్ - ఫూల్పూర్ లోక్‌ సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ)ఓడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కు కంచుకోట అయిన గోరఖ్‌ పూర్‌ లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ 21,961 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫూల్పూర్‌ లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ 59,460 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి కౌశలేంద్రసింగ్ పటేల్‌ ను మట్టి కరిపించారు.

ఈ ప‌రిణామం స‌హ‌జంగానే ఎంద‌రినో ఆలోచన‌లో ప‌డేసింది. అయితే దీనిపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఏదీ శాశ్వతం కాదని మరోసారి తేలిందని మంత్రి కేటీఆర్ అన్నారు. యూపీ - బిహార్‌ లోక్‌ సభ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఉత్తరప్రదేశ్ లోక్‌ సభ స్థానాల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీను ఢీల్లీలో కూర్చోబెట్టిన రాష్ట్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఏదీ శాశ్వతం కాదని సందేశాన్ని పంపింది. మరో జాతీయ పార్టీ మళ్లీ ధరావతును కూడా కోల్పోయిందని ప‌రోక్షంగా కాంగ్రెస్ పార్టీని కెలికారు.
Tags:    

Similar News