మ‌రీ అంత త్వ‌ర‌గా నిద్ర‌పోతారా కేటీఆర్‌!

Update: 2018-03-08 12:50 GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఆస‌క్తిక‌రంగా మారింది. మాట‌ల్లో అస్స‌లు దొర‌క‌ని మంత్రిగారు.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా దొరికిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ రోజు ఉద‌యం తాను  లేచిన వెంట‌నే పేప‌ర్లు చూసినంత‌నే షాక్ తిన్న‌ట్లుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంత షాకింగ్ విష‌యం ఏముంద‌న్న సందేహం క‌లిగినంత‌నే.. దానికి ఆన్స‌ర్ ఇచ్చేశారు కేటీఆర్.

అయితే.. ఆయ‌న చెప్పిన కార‌ణం విన్న వారంద‌రికి ఆయ‌న షాకిచ్చార‌ని చెప్పాలి. నిన్న ఏపీలో జ‌రిగిన‌రాజ‌కీయ ప‌రిణామాలు తెలుగు వారంద‌రికి తెలిసిందే. నిన్న ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ నాన్ స్టాప్ గా కేంద్రం వ‌ర్సెస్ ఏపీ అన్న చందంగా ప‌రిణామాలు వేగంగా మారిపోవ‌టం.. దీనికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఛాన‌ళ్ల‌లో రావ‌టం తెలిసిందే.

చివ‌ర‌కు నిన్న రాత్రి 10.30 త‌ర్వాతఏపీకి చెందిన కేంద్ర‌మంత్రులు రాజీనామా చేయ‌నున్నార‌ని.. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏపీ సీఎం చంద్ర‌బాబు పెడుతున్న‌ట్లుగా ఉద‌ర‌గొట్టేశారు. ఇక‌.. న్యూస్ యాప్ లు ఉన్న వారికి ఈ స‌మాచారం ఫోన్ల‌కు నేరుగా వ‌చ్చేసింది కూడా. అయినా.. ఇవేమీ మంత్రి కేటీఆర్ దృష్టికి రాక‌పోవ‌టం ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. కీల‌క రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్న వెంట‌నే ప్ర‌ముఖుల‌కు ఆ స‌మాచారాన్ని అందించే వ్య‌వ‌స్థ‌లు ఉంటాయి. ఇందుకు మంత్రి కేటీఆర్ లాంటి వారేమీ మిన‌హాయింపు కాదు.  ఆ మాట‌కు వ‌స్తే.. కేటీఆర్ కు ఉన్న న్యూస్ సోర్సులు భారీగా ఉంటాయి.

ఆయ‌న‌కు ప్ర‌తి మీడియా సంస్థ‌లోనూ భారీగా సోర్సులు ఉంటాయ‌ని చెబుతారు. మీడియా సంస్థ‌ల్లో ఏం జ‌రుగుతుంద‌న్న స‌మాచారాన్ని ఎప్ప‌టికిప్పుడు తెలుసుకుంటార‌న్న టాక్ ఉన్న ఆయ‌న‌.. ప‌క్క‌నున్న ఏపీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంటే తాను ఉద‌యం నిద్ర లేచే వ‌ర‌కూ తెలీద‌ని చెప్ప‌టం షాక్ కాక మ‌రింటి?  

కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు త‌న ప‌ద‌వికి రాజీనామా వార్త‌ను చూసి తాను కంగుతిన్నాన‌ని..రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్నది ఊహించ‌లేమ‌ని.. అన్నింటికి సిద్ధంగా ఉండాల్సి వ‌స్తుంద‌న్నారు.

ఈ రోజు హైద‌రాబాద్ లోని బేగంపేట వింగ్స్ ఇండియా స‌ద‌స్సుకు హాజ‌రైన సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ఆ శాఖ‌కు కేంద్ర‌మంత్రిగా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు హాజ‌రు కావాల్సి ఉంది. త‌మ మంత్రులు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అశోక్ గ‌జ‌ప‌తి హాజ‌రు కాలేదు.

ఇదంతా చూస్తుంటే.. నిన్న రాత్రి కేటీఆర్ త్వ‌ర‌గా ప‌డుకొని ఉండాలి. ఆ టైంలో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండాలి. ఇంత త్వ‌ర‌గా నిద్ర‌పోవుడేంది కేటీఆర్ జీ?
Tags:    

Similar News