సెలబ్రిటీలు చాలామంది ఉన్నా.. కొందరు మాత్రం జనాల గుండెల్ని టచ్ చేస్తుంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ వారితో ప్రజలకు అనుబంధం అంతకంతకూ పెరిగిపోతుంటుంది. టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నా.. సమంత ఇమేజ్ మాత్రం భిన్నమైంది. తెర మీద ఎంత అందంగా కనిపిస్తుందో.. రియల్ లైఫ్ లోనూ తన మనసు ఎంత అందమైందన్నది ఆమె చేసే సేవా కార్యక్రమాల్ని గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏదైనా సమస్య మీద స్పందించేందుకు సిద్ధంగా ఉండే సమంతను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అంబాసిడర్ గా చేయటం తెలిసిందే.
సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసినప్పటికీ.. ఆ రోల్ కు న్యాయం చేసిన దాఖలాలు కనిపించవు. అందుకు భిన్నంగా కనిపిస్తుంది సమంత తీరు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన నాటి నుంచి.. చేనేతను ప్రమోట్ చేసే పనిని బాధ్యతగా చేస్తోంది సమంత. తాజాగా ఆమె పని తీరు గురించి.. చేనేత సమస్యల మీద ఆమె చేస్తున్న పర్యటనల గురించి కేటీఆర్ ప్రస్తావిస్తూ ట్వీట్ చేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పటికే చేనేత కార్మికులను కలిసి.. వారి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన సమంత.. గత శుక్రవారం సిద్దిపేటలో పర్యటించి.. పలు చేనేత సహకార సంఘాల్ని సందర్శించారు. చేనేత వస్త్రాల్ని తయారు చేసే వారిని కలిసి వారి కష్టసుఖాల గురించి ఆరా తీసే ప్రయత్నం చేశారు. రెండు రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించిన ఆమె.. అక్కడ వారి చేసే పనికి సంబంధించిన వివరాల్ని సేకరించారు. చేనేతకు సంబంధించిన వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆమె పర్యటించటం మంచి పరిణామంగా వ్యాఖ్యానించారు. అంబాసిడర్‌గా నియమించిన కోటి నజరానా ఇచ్చినోళ్ల కంటే.. డబ్బులేమీ ఇవ్వకున్నా చేనేతపై సమంత కమిట్ మెంట్ ను అభినందించకుండా ఉండలేం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/